కేసీఆర్ కు బహిరంగ లేఖ.. చుక్కలు చూపించిన రేవంత్

కేసీఆర్ కి రెవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసాడు. అధికారం లోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఏ సంక్షేమ పధకం ఏది సరిగ్గా అమలు కావడం లేదని ప్రజలు నానా ఇబ్బందులు పడు తున్నారని వివరించాడు. అలాగే పలు రకాల ప్రభుత్వ పనుల పైన తివ్రంగా విమర్శించాడు ప్రభుత్వమ్ అంటే ప్రజల కోసం పని చేయాలని అంతే కాని మీ సోంత ప్రయేజనాలు చుసుకోవడం ఏంటని పెర్కోన్నారు.స్యయంప్రతిపత్తి హోదా కలిగిన వేదికగా తెలంగాణ యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారో చూపించాలంటూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.యువతలోని నైపుణ్యాలను మెరుగుపరిస్తే దేన్నైనా సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాష్ట్ర యువజన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మల్కాజ్‌గిరి ఎంపీ. స్యయంప్రతిపత్తి హోదా కలిగిన వేదికగా తెలంగాణ యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర యువతను కేసీఆర్ పట్టించుకోవాలని ఆయన అన్నారు.

"
"