నడిరోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు.. మండిపడుతున్న ప్రజలు

10 సంవత్సరాల వైసీపి అధికారం లోకి వచ్చింది. ఏదురు చుసీ చూసీ ఇప్పటికి అధికారం దక్కించుకోనేసరీకి వైసీపీ నాయకులకు అడ్డే లేకుండా పోయింది రాష్ట్రాన్ని వాళ్ళ ఇష్ట్రం వచ్చినట్టు చేస్తున్నారని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజగా జరిగిన ఇదే ఉదాహరణ అసలు ఏమి జరిగిందంటే…వైసీపీ  ఎమ్మెల్యే కుమారుడు ఆపై పుట్టినరోజు వేడుకలు. ఇంకేముంది తన పవర్‌ను చూపించాడు. నడిరోడ్డుపై చౌరస్తాలో బర్త్‌డే వేడుకలు చేసి రెండు గంటలపాటు అంబాజీపేటను అష్టదిగ్భంధం చేశాడు.

కామన్‌ మెన్‌కు కష్టాన్ని కాదు నరకాన్ని చూపించాడు. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు సుపుత్రుడు వికాస్ తన అసలు స్వరూపాన్ని చూపించాడు. తన పుట్టినరోజు నాడు అంబాజీపేట వాసుల సహనాన్ని పరీక్షించాడు. నిన్న సాయంత్రం 5 గంటలకు అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో వేడుకలు నిర్వహించాడు. వందలాదిగా తరలివచ్చిన అనుచరుల మధ్య బర్త్‌ డే పార్టీని గ్రాండ్‌గా నిర్వహించాడు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వేడుకలు రెండు గంటల పాటు నిర్వహించాడు. అంతవరకు ఆ చౌరస్తా వెంబడి ఏ ఒక్క వాహనం ముందుకు కదల్లేదు. దీంతో అంతసేపు వేలాదిగా వాహనాలు ఒకేచోట ఇరుక్కుపోయాయి. భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అడుగు ముందుకు వేయలేక వాహనదారులు నరకం చూశారు. ముఖ్యంగా స్కూల్‌ నుంచి, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇలా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇటు ఎమ్మెల్యే కుమారుడి నిర్వాకంపై అంబాజీపేట వాసులు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఇలా చేస్తారా..? అని మండిపడుతున్నారు. ఇంట్లో చేసుకోవాల్సిన వేడుకలను ఇలా రోడ్డుపై చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే  వచ్చే ఏన్నికలలో డీపాజీట్లు కుడా రావని అక్కడున్న స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"
"