ఆరు నెలల్లో… జనాలు అనుకునేవి ఇవే…!

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తోంది… ఎన్నికల సమయం లో ఎన్నో ఆకర్షణీయ హామీల వర్షంలో రాష్ట్ర ప్రజలను తడిపేసారు జగన్ మోహన్ రెడ్డి… మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు సంబంధించి ఎంత వరకు న్యాయం చేస్తున్నారు అనే దానిపై… భిన్న వాదనలు వినబడుతున్నాయి… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే మొట్ట మొదటగా చెప్పుకోవాల్సింది గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను ఉన్న పళంగా నిలిపివేశారు…అది చూసిన ప్రజలకు అర్థం అయింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం టీడీపీ పట్ల కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది అని…

ఆ తర్వాత ఒక్కొక్కటిగా కక్ష సాధింపు ధోరణి తీవ్రత చూసి ప్రజలు జరబోయే భవిష్యత్ పాలన ఒక అంచనా వచ్చారని చెప్పాలి… ఎందుకంటే అధికార పార్టీ లక్ష్యం ప్రజలకు వారి పనులను చూసి స్పష్టంగా అర్దం అయింది… మారుమూల గ్రామాల నుంచి మొదలైన వైసీపీ రంగుల ప్రస్థానం చూసే సరికి ఈ విషయం అర్ధం అవుతుంది.. కరెంట్ స్తంబాలు మొదలుకుని గేదె కొమ్ములు,చెట్ల ఆకులు,ఇక్కడి తో ఆగకుండా,వయా షిరిడీ సాయిబాబా కు కూడా వైసీపీ జెండా కప్పడం తో రాష్ట్రం మొత్తం విస్తుపోయి చూసింది…ఉద్యోగాల్లో కూడా అన్నిటా వారి పార్టీ వారికే ప్రాధాన్యం… వైసీపీ ప్రవేశ పెట్టిన సంక్షమ పథకాలు సైతం ఆ పార్టీ వారికి తప్ప మిగిలిన సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది… రాష్ట్రంలో అభివృద్ధి కి కొంత స్తబ్దత ఏర్పడిందని చెప్పవచ్చు… చాలా రకాల నిర్మాణాల ఆగిపోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కి ఆటంకం ఏర్పడింది… నిరుద్యోగం తీవ్రత అధికంగా ఉంది…

కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న వాటిని తొలగించారు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు తొలగించారు… కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చిన మాట ను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయారనే చెప్పాలి… మంత్రుల తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు… వారి మాట తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం గా లేదని ప్రజల అభిప్రాయం… పక్క రాష్ట్రానికి అప్పనం గా అక్కడ ఉన్న మన రాష్ట్ర ఆస్తిని అప్పచెప్పి ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వ భూములను అమ్మి పాలన చెయ్యాలి అనే అంశంపై రాష్ట్రం మొత్తం మీద ఆసక్తి కర చర్చలు జరుగుతున్నాయి….