సచివాలయంలో మరో రచ్చ.. వైఎస్ జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్..!

ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు వేస్తున్న సంగతి  తెలిసిందే. ఐతే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఇది చూడలేక ఒక పని చేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసింది. మామూలుగా నే చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసీన పని పూర్తి  రాజకీయంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగును ప్రభుత్వం వేయిస్తుండగా.. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగానే స్పందిస్తున్నారు.ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఏంటీ? అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో గ్రామ సచివాలయానికి పసుపు రంగులు వేశారు తెలుగుదేశం కార్యకర్తలు.

దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ, బులుగు రంగులు వేయడంతో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆ భవనానికి పసుపు రంగు వేశారు.అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెట్టిన ప్లేస్‌లో ఆ ఫోటో తీసేసి సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను పెట్టారు.దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని పెట్టడం నేరం అని చెబుతూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.ఇప్పుడు అందరు అనుకుంటున్నది ఏమిటంటే మామూలుగా వైసీపీ నాయకులు  భాధితుల మీద కెస్ మాత్రమే పెట్టారు . కానీ ఎన్టీఆర్  ఫోటో  పెట్టినందుకు ఒక్క వైసీపీ నాయకుడు కూడా విమర్శించలేకపోయారు.

మామూలుగా అయితే వైసీపి నాయకులు చిన్న సంధు దోరికినా టీడీపీ  పై విమర్శలు చేస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా వైస్ జగన్ ఫోటో పైన ఎన్టీఆర్ ఫోటొ పెట్టినా  ఏవరు మాట్లాడలేని పరీస్థీతి. అందరు అనుకుంటున్నట్టుగా ఏంత అయినా  అన్నగారిని ఎవరైనా ఇప్పటికి విమర్శించగలరా.సరిగ్గా అదే లక్షణాలతో పుట్టిన  ఎన్టీఆర్ మనవడు కదా ఇంకా ఏం మాట్లాడతారు. గౌరవం ఇవ్వడం తప్ప అని తెలుగు తమ్ముల్లు అనుకుంటున్నారు.

 

"
"