కైకలూరులో టీడీపీకి అడ్వాంటేజ్.. ఆయన గెలుపుకు అదిరే వ్యూహం

కైకలూరులో టీడీపీ అభ్యర్థిగా బీసీ వర్గాల్లో పట్టు ఉన్న జయమంగళ వెంకటరమణకు టికెట్‌ ఖరారు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకపోవడంతో కార్యకర్తల్లో, ప్రజల్లో అయోమయం తొలగింది. సీఎం చంద్రబాబు కైకలూరు నేతలతో జరిపిన సమావేశం అనంతరం అభ్యర్ధిగా జయమంగళ వెంకటరమణను ప్రకటించడంతో రాజకీయ ఉత్కంఠకు తెర పడింది.

వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన దూలం నాగేశ్వరరావు, టీడీపీ నుంచి బీసీ వర్గాలకు చెందిన జయమంగళవెంకరమణ పోటీలో ఉండటంతో హోరాహోరీ పోరు నడవనుందని రాజకీయ పండితుల అంచనాప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాజిక వర్గాల వారీగా గెలుపు ఓటములపై తీవ్ర చర్చ జరుగుతోంది. బీసీ కులాలు టీడీపీకి అండగా ఉండటం కలిసివచ్చే అంశం. జడ్పీటీసీ నుంచి అంచలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన జయమంగళకు వెనుకబడిన కులాలు, పేద వర్గాల ప్రజల్లో మంచిపేరు ఉండటంతో గెలుపునకు అవకాశాలు ఉన్నాయి. కొల్లేరులో 21 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ఓట్లు కీలకం కానున్నాయి. కొల్లేటి గ్రామాల్లో వడ్డీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వారందరూ గ్రామ కట్టుబాట్ల ప్రకారం ప్రతి ఎన్నికల్లో నూటికి 90 శాతం మంది ఒక అభ్యర్థికే ఓటు వేస్తుంటారు. 2009, 2014 ఎన్నికల్లో సైతం కొల్లేరు ప్రజల విలక్షణమైన తీర్పుతో టీడీపీ, బీజేపీ గెలుపు నల్లేరుపై నడకగా మారింది. ప్రస్తుతం బీసీ, ఓసీ వర్గాల మధ్యన ఎన్నికలు జరగడం బీసీల్లోని అనేక సామాజిక వర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉండటం కలిసొచ్చే అంశం.

గతంలో… జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఆయన ప్రజలకు మేలు చేశారు. ఇప్పుడు వారంతా.. మళ్లీ తమకు జయ మంగళ వెంకటరమణ కావాలని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. జయ మంగళకు జయం ఖాయమంటున్నారు. ఇక్కడ… ఎంపీ మాగంటి బాబుకు కూడా మంచి పట్టు ఉంది. ఆయన పోటీ చేయాలని అనుకున్నారు. కానీ.. ఎంపీగానే వెళ్లడంతో… జయమంగళకు చాన్స్ దొరికింది.