బాబు ఆ ప‌ని చేస్తే జ‌గ‌న్‌కు టెన్ష‌నే…!

ఏపీలో ఇప్పుడు కొత్త రాజ‌కీయ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దేశ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న రాజ‌కీయ ఎత్తులు చూస్తే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న దాఖాలాలు క‌నిపిస్తున్నాయి. ఏపీలో ఆరు నెల‌ల జ‌గ‌న్ పాల‌న‌కు చంద్ర‌బాబు త‌న ఎత్తుల‌తో చెక్ పెట్టెందుకు స‌న్న‌హాలు చేస్తున్నారా.. ఈ స‌న్న‌హాలు, చంద్ర‌బాబు రాజ‌కీయ ఎత్తులు ప‌సిగ‌ట్టిన సీఎం జ‌గ‌న్ కు భ‌యం ప‌ట్టుకున్న‌ట్లుంది. అందుకే ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను చూస్తుంటే తెలుస్తుంది. చంద్రబాబు వేస్తున్న రాజ‌కీయ ఎత్తుల ముందు జ‌గ‌న్ చిత్తు అయ్యేలా ఉన్న‌ట్లున్నాడు అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇంత‌కు చంద్ర‌బాబు వేస్తున్న ఎత్తులు ఏమిటీ.. మార‌బోతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఏమిటీ.. అందుకు సీఎం ఎందుకు బాబును చూసి జంకుతున్నాడు.. అనే ప్ర‌శ్న‌లు మ‌దిలో మెదులుతున్నాయి.చంద్ర‌బాబు గ‌త 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో దోస్తానా క‌ట్టాడు.

ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ అండ‌తో చంద్ర‌బాబు భారీగానే లబ్ధి పొందాడు. అధికారం చేపట్టాడు. చంద్ర‌బాబు పాల‌న‌లో బీజేపీ భాగం పంచుకుంది. త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు బీజేపీకి రాంరాం చెప్పాడు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ ఒంట‌రిగానే పోటీ చేశారు. దీంతో రెండు పార్టీలు భారీగానే న‌ష్ట‌పోయాయి. బీజేపీ క‌నీసం బోణి కూడా కొట్ట‌లేదు.ఇక టీడీపీ అతి ఘోరంగా ఓటమి చెంది 23 సీట్ల‌కే ప‌రిమితం అయింది. అయితే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత జ్ఞానోద‌యం అయిన టీడీపీ త‌రువాత త‌న ఆలోచ‌న విధానాన్ని మార్చుకుంది. దీంతో బీజేపీకి ద‌గ్గ‌ర అయ్యి ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుపై పోరు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉంది టీడీపీ. అంతే కాదు భ‌విష్య‌త్‌తో బీజేపీతోనే జ‌ట్టుక‌ట్టేందుకు టీడీపీ సిద్ద‌మైంది. అందుకే టీడీపీ ఎంపీల‌తో బీజేపీ తో ట‌చ్‌లో ఉండేలా చంద్ర‌బాబు వ్యూహ‌ర‌చ‌న చేశార‌ని తెలుస్తుంది.చంద్ర‌బాబు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో టీడీపీ నేత‌ల‌ను, ఎంపీల‌ను నిత్యం క‌లిసి పొత్తు కోసం ప‌నిచేసేలా ఒప్పించేందుకు చంద్ర‌బాబు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారనే టాక్ ఇప్పుడు రాజకీయ స‌ర్కిల్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అందుకు బాబు ప‌క్కా స్కెచ్‌తోనే ముందుకు సాగుతున్నారు. అందుకే చంద్ర‌బాబు త‌న ఎంపీల‌ను అమిత్ షాతో భేటి చేయించి ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుపై పిర్యాదు చేయించార‌ట‌.

ఏపీలో అభివృద్ధి ప‌నుల పేరుతో అపాయింట్‌మెంట్ తీసుకుని జ‌గ‌న్ వ్య‌తిరేక పిర్యాదుకు వేదిక‌గా మార్చుకున్నారు.అయితే ఇప్పుడు చంద్రబాబు వేస్తున్న ఎత్తుల‌తో బీజేపీ టీడీపీతో జ‌త‌క‌డితే జ‌గ‌న్ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌బోతుంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ ఒక్క‌టై ఏపీలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ఉద్య‌మం చేస్తారేమో అనే భ‌యంతో జ‌గ‌న్ ఉన్నాడ‌ని తెలుస్తుంది.చంద్ర‌బాబు రాజ‌కీయ ఎత్తులు వేయ‌డంలో దిట్ట‌. అందుకే జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు చేస్తున్న పోరాటాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న బీజేపీ రాబోవు రోజుల్లో తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు ఉన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. టీడీపీతో బీజేపీ జ‌త క‌డితే జ‌గ‌న్‌కు భ‌విష్య‌త్‌లో చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మే.