జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించను…!

తిరుపతి కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… జగన్ తన కులం మానవత్వం అన్నారు… అంటే ఇతర కులాలకు మానవత్వం లేదా అని పవన్ నిలదీశారు. జగన్ వంద రోజులు జైల్లో ఉండి అధికారంలోకి రాగా లేనిదీ… తాను ఎందుకు ప్రజా సమస్యలపై పోరాడలేనని వ్యాఖ్యానించారు. తాను అన్ని తెగించి రాజకీయాల్లోకి వచ్చాను అని…ప్రజా సమస్యలపై తాను ఎందుకు మొండిగా తిరగలేను అని ప్రశ్నించిన పవన్…

సమస్యలు వస్తే కళ్ళకు గంతలు కట్టుకుని ఉండలేను అన్నారు.భావి తరాల అభ్యున్నతి కోసం అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేసారు. జగన్ రెడ్డిని తాను అసలు ముఖ్యమంత్రిగానే గుర్తించనని స్పష్టం చేసారు పవన్. రాయలసీమకు జగన్ మచ్చ తెచ్చారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ లాంటి వారికి ఏ పదవి లేకపోయినా వారిని స్మరించుకుంటామని పవన్ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు.చట్ట సభల్లో మాట్లాడే వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అదే విధంగా మాతృ భాషను చంపేస్తుంటే తన గుండె తరుక్కు పోతుందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేసారు.తను మధ్య తరగతి నుంచి వచ్చి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన… ప్రజాసమస్యలపై మాత్రమే స్పందిస్తాను అని స్పష్టం చేసారు.

తన నుంచి అద్భుతాలు ఆసించవద్దని కోరారు. రాయలసీమను కొన్ని బ్యాచులు కబ్జా చేశాయని ఆయన మండిపడ్డారు. రాయలసీమను చదువుల సీమగా మార్చాల్సిన అవసరం ఉందీ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాలనలో ఉల్లి పాయలు దొరకని పరిస్థితి ఉందని చట్టాలు చేసే వారు బూతులు మాట్లాడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.