సంచలనం : 14 ఏళ్ల తర్వాత హరీష్ రావును కలిసిన కీలక నేత… పార్టీ మార్పు ఖాయమేనా..?

టీఆర్ఎస్, కాంగ్రేస్ లో ఇద్దరు నేతలు చిరకాల శత్రువులు వీళ్ళ రాజకీయ వైరం ఇప్పటిది కాదు.14 ఏళ్ళ అప్పటిది. ఇ నెతలు కు ఏంత వీరోదమ్ అంటే ఒకరి దగ్గర ఒకరీ గురించి ప్రస్తావన తేస్తే నే భగ్గుమనే అంత వైరం. ఇంతలా వైరమ్ వున్నవారు.ఒకే సారీ కలీస్తే రాజకీయ పరిస్థీతులు ఏలా మారతాయి. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం అలాగే వుంది.వీళ్ళ కలయిక దేనికి దారీతోస్తుందో అని ఇరు పార్టీల నేతలు అనుకుంటున్నరు.అసలు ఎవరు ఈ నేతలు అని అనుకుంటున్నారా టీఆర్ఎస్ నుండి హరీశరావు, కాంగ్రేస్ నుండి  జగ్గా రెడ్డి.

హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులైన హరీష్ రావు, జగ్గారెడ్డి కలిశారు. మంత్రి హరీష్ రావును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్ రావుతో మాట్లాడారు జగ్గారెడ్డి. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐతే వీరి కలయిక తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారా? లేదంటే తెర వెనక ఇంకేమైనా జరుగుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరకుండా హరీష్ రావే అడ్డుకున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు హరీష్ రావుపై వీలుచిక్కినప్పుడల్లా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చాలా సందర్భాల్లో మండిపడ్డారు. హరీష్ రావుకు చుక్కలు చూపిస్తానంటూ నిప్పులు చెరిగారు. హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. రాను రాను ఇది ఏ పరీస్థితులకు దారీతీస్తుందో అని  పార్టీ నేతలందరు భావిస్తున్నారు.

"
"