కేసీఆర్ నిర్ణయంతో హరీష్ కు మరో భాద్యత.. ఇది కూడా వ్యూహమేనా..?

మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావుకు కీలకమైన ఆర్థికశాఖను అప్పగించిన సీఎం కేసీఆర్… తాజాగా ఆయనకు మరో కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మరో కీలక బాధ్యత అప్పగించారు. ఇప్పటికీ తన దగ్గరే ఉన్న పలు శాఖలకు సంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతలను పలువురు మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే తన దగ్గరే ఉన్న కీలకమైన సాగునీటి పారుదల వ్యవహారాలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు.

గతంలో సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించి కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హరీశ్ రావుకు కేసీఆర్ మరోసారి అదే శాఖ అప్పగిస్తారనే ప్రచారం జరిగింది.అయితే సీఎం కేసీఆర్ మాత్రం సాగునీటి పారుదల శాఖను తన దగ్గరే పెట్టుకుని హరీశ్ రావుకు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. అయితే తన దగ్గర ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యతలను పలువురు మంత్రులకు అప్పగించిన కేసీఆర్… రెవెన్యూ శాఖకు సంబంధించిన బాధ్యతను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే సాగునీటి వ్యవహారాల అంశంలో అనుభవం ఉన్న హరీశ్ రావుకు ఆ శాఖకు సంబంధించిన సమాధానాలు చెప్పే బాధ్యతలను అప్పగించారు. సాగునీటి పారుదల శాఖతో పాటు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యతలను హరీశ్ రావుకే అప్పగించారు సీఎం కేసీఆర్.

"
"