ఏపీకి గుడ్ న్యూస్.. జగన్ తో ఒప్పందంలో కేంద్ర మంత్రి బంపర్ ఆఫర్

వైఎస్ జగన్ ఏపీకి  ముఖ్యమంత్రి అయ్యాక ఒక  పరిశ్రమ  కడపకు రానుంది. ఇది నిజంగా సీమ ప్రజలకు శుభవార్త. ప్రఖ్యాత సంస్థతో వైఎస్ జగన్ సమావేశం జరిగిపాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక దినితో ఎపీ ప్రజలు హర్షం వ్యక్తం చెస్తున్నారు.కడప స్టీల్‌ పరిశ్రమకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరా కానుంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు హామీ ఇచ్చారు.

శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన, సంబంధిత అధికారులు సమావేశమయ్యారు. విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీని కోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని జగన్‌ వివరించారు. ప్లాంటు నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనికి ధర్మేంద్ర సానుకూలంగా స్పందించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్‌ఎండీసీ అధికారులను ఆదేశించారు.

విభజన చట్టం ప్రకారం ముడి చమురు రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని, కాకినాడలో ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌… పెట్రోలియంశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నత స్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామ వివరించారు. తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్రోరంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజ వాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టు, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్‌, కడపలో స్టీల్‌ప్లాంట్‌ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. సీఎం మాట్లాడుతూ… చమురు, గ్యాస్‌ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్లుగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌) నిధులు ఇచ్చేలా చూడాలని కోరగా… ఆ మేరకు చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర చెప్పారు. చమురు, గ్యాస్‌ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెంలో జీఎ్‌సపీసీ లిమిటెడ్‌ నిర్వహించిన ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేయగా… వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర అధికారులను ప్రధాన్‌ ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రికి, ప్రభుత్వరంగ సంస్థల సీఎండీలకు తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం విందు ఇచ్చారు.