గిద్దలూరు చరిత్రను తిరగరాయబోతున్న ‘ అశోక్‌ ‘ … !

పశ్చిమ ప్రకాశంలోని వెనుకబడిన నియోజకవర్గమైన గిద్దలూరులో ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి తిరగరాయబోతున్నారు. పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనకబడిన నియోజకవర్గమైన గిద్దలూరును నియోజకవర్గం ఏర్పడ్డాక ఆరున్నర దాశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి గత రెండేళ్లలో జరిగింది. అశోక్‌ రెడ్డి ఓవరాల్‌గా రూ. 2,500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించారు. సుధీర్ఘ‌కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న తాగు నీటి సమస్యను సైతం ఆయన చాలా వరకు పరిష్కరించారు. నియోజకవర్గంలో అంతర్గత రహదారులన్నీ ఆయన హ‌యాంలోనే పూర్తి ఆయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఆరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీపై గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా నుంచి మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డికి సీఎం నుంచి పిలుపు రావడంతో పాటు సీఎం ముగ్గురు నేతలకు చంద్రబాబు టిక్కెట్‌పై గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చేశారు.

వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసే అంశంపై అశోక్‌రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై పలు సూచనలు, సల‌హాలు కూడా చేసినట్టు తెలిసింది. అశోక్‌రెడ్డికి టిక్కెట్‌పై చంద్రబాబు గ్రీన్ సిగ్న‌ల్‌ ఇవ్వడంతో గిద్దలూరు టీడీపీ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని గిద్దలూరు మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేశారు. అశోక్‌ రెడ్డి గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతీ రోజు జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఇక ఎన్నికల వేడి స్టార్ట్‌ట్‌ అవ్వడం అటు చంద్రబాబు తొలి జాబితా రీలీజ్‌ కాకముందే అశోక్‌రెడ్డికి పోటీపై గ్రీన్ సిగ్న‌ల్‌ ఇవ్వడంతో టీడీపీకి చాలా ప్లస్‌ అవ్వడం ఒక ఎత్తైతే అదే టైమ్‌లో అటు ప్రత్యర్థి పార్టీలో ఉన్న లుక‌లుకలు కూడా ఇక్కడ అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్‌ కానున్నాయి. అన్నిటికి మించి చంద్రబాబు ముందు అశోక్‌ రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్‌ ఇవ్వడంతో పాటు పలు నిఘా నివేదికల్లో సైతం నీకు చాలా మొగ్గు ఉందని ప్రశంసించడాన్ని బట్టి చూస్తే గిద్దలూరులో మరో సారి అశోక్‌ గెలుపు నల్లేరు మీద నడకే కానుందని స్పష్టం అవుతోంది.

టిక్కెట్‌ ప్రకటనతోనే గెలుపు ఖరారైందా.. ఇవే శుభసంకేతాలు..!

ఇదిలా ఉంటే మరో వైపు గిద్దలూరు నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు కార్యకర్తలు వరుసపెట్టి టీడీపీలోకి చేరుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కొద్ది రోజుల క్రితం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికైన అన్నా రాంబాబు వర్గానికి చెందిన కీలక వర్గీయులు అంతా వరుసపెట్టి అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధితో పాటు స్థానికంగా నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ జరగని అభివృద్ధి అశోక్‌ రెడ్డి హ‌యాంలో జరగడంతో వారు ఆయన్ను ప్రశంసించారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్న అశోక్‌ రెడ్డి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా పనులు చేస్తున్నారని కూడా వారు ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్‌ రెడ్డి విజయానికి కృషి చెయ్యడంతో పాటు ఇక్కడ ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏదేమైనా గిద్దలూరులో ఎన్నికల వేడి స్టార్ట్ అయ్యిందో లేదో వెంటనే తెలుగుదేశం పార్టీకి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. సామాన్యుడిగా పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించిన అశోక్ గిద్ద‌లూరు లాంటి సంక్లిష్ట రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా రెండోసారి గెల‌వ‌డం అంటే రికార్డే..!