గంటా మాస్టర్ ప్లాన్.. వెళ్తున్నది ఆ పార్టీలోకే

టీడీపీ మాజిమంత్రి బలమైన నెత గంటా శ్రీనివాస్ రావు, రాష్ట్రంలో ఏప్పుడైతే టీడీపీ సార్వత్రీక ఏన్నికలలో ఓడిపోయిందో అప్పటినుండి  గంటా శ్రీనివాస్ రావు వైసీపీలోకి వేళతాడని అందరు అనుకుంటున్నారు. కానీ అయన ఏప్పటికి అప్పుడు క్లారీటి ఇస్తూ వస్తూన్నాడు. కానీ అయనపై విమర్శలు మాత్రం ఆగడం లేదు.ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయిన కొద్దిరోజులకే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. ఆయన శ్రీలంకలో ఉన్నారని… టీడీపీలోని డజను మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గంటా బీజేపీలోకి వెళతారని అప్పట్లో ఊహాగానాల వినిపించాయి. అయితే తాను ఎక్కడికి వెళ్లబోనని… టీడీపీలోనే ఉంటానని గంటా క్లారిటీ ఇచ్చారు. కొన్ని రోజుల నుంచి ఇస్తూనే ఉన్నారు. కానీ ఆయన పార్టీ మారతారనే వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా గంటా పార్టీ మారడం దాదాపు ఖాయమైందని… త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళుతున్నారని ప్రచారం జోరందుకుంది.

అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని కాదని గంటా బీజేపీలోకి వెళతారా ? వెళితే దాని వెనక ఆయన వ్యూహం ఏమై ఉంటుందనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. అయితే బీజేపీలోకి వెళ్లడం ద్వారా సేఫ్ గేమ్ ఆడొచ్చని గంటా భావిస్తున్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీలోకి వెళ్లడం ద్వారా టీడీపీ నుంచి విమర్శలు పెద్దగా ఉండవని ఆయన భావిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లినా… వారిపై టీడీపీ, చంద్రబాబు పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా… చంద్రబాబు ప్రస్తుతానికి అదే రకమైన వైఖరిని అవలంభిస్తారనే టాక్ ఉంది. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తుందా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీలో చేరడం వల్ల వైసీపీ నుంచి రాజకీయ దాడి జరిగే అవకాశం కూడా తక్కువే అని గంటా శ్రీనివాసరావు భావించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యత కోరుకుంటున్న వైసీపీ… మళ్లీ బీజేపీతో స్నేహం కోరుకుంటున్న టీడీపీ… గంటా బీజేపీలోకి వెళితే పెద్దగా ఆయనపై పెద్దగా విమర్శలు చేయకపోవచ్చనే టాక్ కూడా ఉంది. మొత్తానికి బీజేపీలోకి గంటా వెళ్లాలని డిసైడయితే… ఆయన ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.