మహిళలనీ చూడకుండా స్టేషన్లకు

పల్నాడులోని అత్మకురులో టిడిపీ కార్యకర్తలను అన్యాయంగా ఊరి నుండి బయటకి  పంపడంపై  చంద్రబాబు నేతలందరీతో  ఛలో అత్మకురు అనె కార్యక్రమ్మాన్ని అర్థంతరంగా పోలిసులు అద్దుకున్నారు.వైసీపీ దాడుల బాధితులను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన ‘చలో ఆత్మకూరు’పై జగన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆత్మకూరు వెళ్లడానికి కార్యకర్తలతో కలిసి సిద్ధమయిన చంద్రబాబును ఆయన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉంచారు. రాష్ట్ర నలుమూలల నుంచి బయల్దేరిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనల మధ్య నిర్బంధించి భగ్నం చేయగలిగారు. రాజధాని సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇళ్లలో, పార్టీ కార్యాలయాల్లో నిర్బంధించారు. మరికొందరిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు కూడా పల్నాడుకు యాత్ర తలపెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ శ్రేణులు ప్రశాంతంగా నిరసనలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆందోళనలు అదుపు తప్పకుండా ఒక పరిధిలో కొనసాగాయి.


వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా పల్నాడులో ఆ పార్టీ శ్రేణుల దాడులకు భీతిల్లి పెద్దసంఖ్యలో టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల కుటుంబాలు కొన్ని గ్రామాల నుంచి బయటకు వచ్చేశాయి.వంద రోజులైనా వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో వారికోసం టీడీపీ నాయకత్వం గుంటూరు వైన్‌ డీలర్స్‌ కల్యాణమండపంలో బాధితుల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 125 కుటుంబాల వారు ఆశ్రయం పొందారు. వీరిని సొంత గ్రామాలకు తీసుకువెళ్లడానికే చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కు పిలుపిచ్చారు. మాచర్ల నియోజకవర్గంలోని ఈ గ్రామం నుంచి సుమారు70 కుటుంబాలు భయంతో బయటకు రావాల్సి వచ్చింది. దీనితో ముందుగా ఈ గ్రామాన్ని చంద్రబాబు ఎంచుకొన్నారు. దీనిని భగ్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మంగళవారమే పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులందరినీ అదేరోజు రాత్రి నుంచే గృహ నిర్భంధంలోకి తీసుకొన్నారు. వారెవరినీ ఇళ్ల నుంచి కదలనీయకుండా కాపలా పెట్టారు. ఈ కార్యక్రమం కోసం బస్సులు, కార్లు వంటి వాహనాలు అద్దెకు ఇవ్వవద్దని అన్ని ట్రావెల్‌ ఏజెన్సీలకు నోటీసులు పంపారు. ధర్నాలు, ఇతర ఆందోళనలను నిలవరించడానికి 144 సెక్షన్‌ విధించారు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఇతర జిల్లాల నుంచి వస్తున్న టీడీపీ నేతలను కూడా వచ్చినవారిని వచ్చినట్లే అదుపులోకి తీసుకొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను ఉండవల్లి నివాసంలో హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన ఇంటి గేటు మూసేసి బయట తాడు కట్టేసి కాన్వాయ్‌ బయటకు రాకుండా ఆపేశారు.విషయం తెలుసుకొని ఉండవల్లి చేరుకొన్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, జవహర్‌, ఎమ్మెల్సీలు రామారావు, నాగజగదీశ్‌లను అదుపులోకి తీసుకొని వేమూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పదిగంటలపాటు వారికి నరకం చూపించారు. కుర్చీల్లోంచి వారిని కదలనీయలేదు. కనీసం వారికి భోజన ఏర్పాటు చేయలేదు. చివరకు, టీడీపీ కార్యకర్తలే తమ నేతలకు బయట నుంచి తెచ్చి భోజనం పెట్టారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు తదితరులు బుధవారం తెల్లవారుఝామున విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగగానే అదుపులోకి తీసుకుని పున్నమి గెస్ట్‌హౌ్‌సకు తరలించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు, భర్త విజయవాడలోని నోవా టెల్‌ హోటల్‌లో ఉంటే పోలీసులు అక్కడకు వెళ్లి వారి గదులు తనిఖీ చేసి బయటకు రావద్దని హెచ్చరించారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ప్రకాశం బ్యారేజి వద్దే ఆపేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. తాము చంద్రబాబు ఇంటికి నడిచి వెళ్తామని వారు చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనూరాధ, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు, అశోక్‌ బాబు తదితరులు కూడా నిర్భంధానికి గురయ్యారు. విజయవాడ నుంచి తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళుతున్న ఎంపీ కేశినేని నాని వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రకాశం బ్యారేజీపై నుంచి కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించగా బలవంతంగా వెనక్కి తరలించారు. చంద్రబాబు ఇంటికి చేరుకోకుండా తనను పోలీసులు అడ్డుకోవడానికి నిరసనగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ ఉండవల్లి వద్ద రోడ్డుపైనే కొద్దిసేపు బైఠాయించారు.

ఆయనను అదుపులోకి తీసుకొన్న పోలీసులు తొలుత మంగళగిరి పోలీ్‌సస్టేషన్‌కు, అక్కడినుంచి నల్లపాడు, తెనాలి, దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. గుంటూరు శిబిరంలో ఉన్న మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నక్కా ఆనందబాబు. ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితలను చంద్రబాబు నివాసం వద్ద అరెస్టు చేసి తరలించారు. వారిని మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి తదితర పోలీసు స్టేషన్లకు తిప్పారు. విశాఖపట్నం నుంచి అనంతపురం వరకూ ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నడిచింది.

"
"