ఈటెలకు చెక్ .. కేసీఆర్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఇదేనా..?

తెలంగాణ టిఆర్ఎస్ లో ఈటెల చెసిన వ్యాఖ్యలు కేసిఆర్ మాములుగా తీసుకున్నారని,ఈటెలకు మంత్రి పదవి కోనసాగ్స్తున్నారని అందరీని కేసీఆర్ నమ్మించాడు. కాని అసలు విషయం వెరె వుంది.అసలు జనానికి చుపించేది వేరు అక్కడ జరీగేద్ వేరు ఈటెల విషమంలో కూడా అదే జరుగుతోంది.బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజునే ఈటెల ప్రాతినిధ్యం తగ్గించే పనికి శ్రీకారం చుట్టారు అధినేత.ఇందులో భాగంగా అసెంబ్లీ వ్యవహారాల్లొ ఈటల రాజేందర్ తలదూర్చ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడం మొదలైనట్లుగా స్పష్టం అవుతోంది.

మంత్రివర్గంలో కొనసాగిస్తూనే అశక్తుడుగా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు అర్థమవుతోంది. పొమ్మనలేక పొగపెడుతున్నట్లు ఉందా అన్నట్లు జిల్లాలో చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణ వరకు ఆయన భవిష్యత్తు ఏంటి అన్న చర్చలు జరిగాయి. అయితే ఆయన ను మంత్రివర్గంలోనే కొనసాగించారు అధినేత కేసీఆర్. అయితే మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరిగిన 24 గంటల్లోనే మరో పరిణామం చోటు చేసుకోవడంతో ఈటలకు కత్తెర పెట్టే ప్రక్రియ మొదలైందన్న సందేహాలు మొదలయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజునే ఈటెల ప్రాతినిధ్యం తగ్గించే పనికి శ్రీకారం చుట్టారు అధినేత.ఇందులో భాగంగా అసెంబ్లీ వ్యవహారాల్లొ ఈటల రాజేందర్ తలదూర్చ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేందర్‌ను తొలగించాలని కోరుతూ టిఆర్ఎస్ అధిష్టానం స్పీకర్‌కు లేఖ రాసింది.

ఆయన స్థానంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను నియమించాలని కోరింది. దీంతో ఈటెల ప్రాతినిధ్యం తగ్గించే పక్రియ చాపకింద నీరులా సాగుతుందని తెలుస్తోంది. ఈటెల రాజేందర్ మంత్రివర్గంలో అవకాశం కల్పించవద్దన్న నిర్ణయం ఎన్నికలప్పుడే జరిగిందని తెలుస్తోంది. బోయినపల్లి వినోద్ కుమార్ అధినేతను ఒప్పించడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో కేటాయించారన్నది బహిరంగ రహస్యం. అయితే ఈటెల రాజేందర్ విషయంలో అధినేత ఎందుకు సీరియస్‌గా ఉన్నారు అన్న విషయం మాత్రం అంతుచిక్కకుండా తయారైందని ఆయన వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన ఈటెల రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేతకు దూరం కావడం వెనుక ఆంతర్యం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటటే పార్టీలో ఈటేల వుంటారు కాని ఏం చేయలేని పరీస్థితికి తిసుకురావాలనీ కేసీఆర్ ప్లాన్.