ఈటెలకు కేసీఆర్ ఫోన్.. హుటాహుటీన బయలుదేరిన తెలంగాణ మంత్రి

మంగళవారం  రాత్రి ఈటేల రాజెందర్ కీ కెసీఆర్ ఫోన్ చేశాడు.రాష్ట్రంలో ప్రస్తుతం జ్వరాలు ఎక్కువవుతున్నాయని, వాటిని మనమే అదుపు చెయాల్ని కొన్ని సూచనలు ఇచ్చినట్టు సమాచారం.అలాగే వాళ్ళకు కావాల్సీన అవసరాల్ను చుసూకోవాలని అదేశించినట్టూ సమాచారం.డెంగీ తీవ్రత, సీజనల్‌ జ్వరాల పరిస్థితి, రోగులకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు మరింత దగ్గర కావాలని, వైద్యసేవల్లో ఎలాంటి లోపం రాకుండా చూసుకోవాలని సూచించారు. ఏజెన్సీల్లోని ఆస్పత్రులను సందర్శించి.. పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

వైద్య సేవలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తనకు తెలియజేయాలని, అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటలకు సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ తీసుకున్న చర్యలను కేసీఆర్‌కు ఈటల వివరించినట్లు సమాచారం. సుమారు 20 నిమిషాలసేపు ఈటలతో కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖపై కేసీఆర్‌ బుధవారం సమీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అది వాయిదా పడినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో డెంగీ, వైరల్‌ జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఆయన 6 జిల్లాలను సందర్శించారు. మంగళవారం సూర్యాపేట మెడికల్‌ కాలేజీ, ఖమ్మం ప్రభుత్వాస్పత్రి, కొత్తగూడెం ఆస్పత్రిని సందర్శించారు. రోగులను కలసి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రతి ఆస్పత్రిలోనూ స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మహబూబాబాద్‌ ఆస్పత్రి, ములుగు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

డెంగీ జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందొద్దని.. ఈ సీజన్‌ జ్వరాల్లో 98ు విష జ్వరాలేనని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, విష జ్వరాల కేసుల వివరాలను ప్రతిరోజూ ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లోనే రోగాలను గుర్తించగలిగితే జిల్లా ఆస్పత్రులకు రోగుల తాకిడి తగ్గుతుందన్నారు.మహబూబాబాద్‌లో 300 పడకల ఆస్పత్రి కోసం రూ.100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందన్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా భద్రాద్రి ఏజెన్సీ ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందుతున్నాయని కితాబిచ్చారు. భద్రాద్రి రామాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

"
"