డబుల్ సక్సెస్.. అదరగోట్టేస్తున్న నాలుగు కెమెరాల ఫోన్‌

నిలువుగా నాలుగు కెమెరాలతో క్వాలిటీ ఫొటోల్ని అందించే క్వాడ్‌ క్యామ్‌ ఫోన్‌ల రేట్‌ను అందుబాటులోకి తెస్తూ – ఇటీవల రియల్‌ మీ 5 ప్రో మార్కెట్లోకి వచ్చింది. తొలివిడతలో ఫోన్లన్నీ చెల్లుబాటు అయిపోయి కేవలం కొద్దిరోజుల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో వీటి సేల్‌ మళ్లీ మొదలైపోయింది. నాలుగు కెమెరాల ఫోన్ల పట్ల జనం మొగ్గు చూపుతున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ!రియల్‌ మీ 5 ప్రో కెమెరాలో … అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ ఫెసిలిటీతో బాటు మెయిన్‌ రిజల్యూషన్‌ 48 మెగాపిక్సెల్స్ గా ఉంది‌‌. సెప్టెంబర్‌ 4 న అందుబాటులోకి రానున్న 5 ప్రో గత వెర్షన్‌ 5 కంటే బెటర్‌ ర్యామ్‌, మోర్‌ స్టోరేజ్‌ తో ఆకర్షణీయంగా అనిపిస్తోంది.

రియల్‌ మీ ఖరీదు 10వేలు కాగా, ఈ ప్రో వెర్షన్‌ 14 వేల రూపాయల్లో లభించబోతోంది. ర్యామ్‌, స్టోరేజ్‌ని బట్టి రేట్లలో వేరియేషన్‌ ఉంది.

రియల్‌ మీ 5 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4035 ఎంఎహెచ్‌ కాగా – దీంట్లో వూక్‌ (Vooc ) ఛార్జింగ్‌ 3.0 ఫెసిలిటీ వల్ల ఈ ఫోన్‌ ని అత్యంత వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. మొదటి 55 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవ్వడానికి ఈ ఫోన్‌ తీసుకునే సమయం కేవలం అరగంట మాత్రమే!

రియల్‌ మీ 5 ప్రో స్పెసిఫికేషన్స్‌, రేట్లు ఇవీ :
Realme 5pro (quad camera)

(first sale on SEPT 4th, 12PM)

4GB+64GB – రూ. 13999

6GB+64GB – రూ. 14999

8GB+128GB – రూ. 16999

Expandable Upto 256 GB

16.0 cm (6.3 inch) FHD+ Display

Display Size 16.0 cm (6.3 inch)

Resolution 2340 x 1080 pixels

Resolution Type FHD+

48MP + 8MP + 2MP + 2MP | 16MP Front Camera

4035 mAh Battery

Qualcomm Snapdragon SDM712 Octa Core 2.3 GHz Processor

VOOC Charging

Fingerprint – backside

"
"