లోకేష్ దెబ్బకు దిగజారిన మోడీ.. సోము వీర్రాజు కన్నా ఘోరంగా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయ సభ కోసం గుంటూరు వచ్చి…లోకేష్‌ను టార్గెట్ చేసిన వైనం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చంద్రబాబు, లోకేష్‌ల పాలనపైన కానీ.. రాజకీయాల్లో వారి పాత్ర కానీ.. పాలనా తీరులోనూ.. భారతీయ జనతాపార్టీ నేతలుగా విమర్శలు చేయవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ.. లోకేష్ స్థాయి ఏమిటి..? మోడీ స్థాయి ఏమిటి..?. ఎవరో సోము వీర్రాజునో.. మరో కన్నా లక్ష్మినారాయణలో విమర్శిస్తే సరిపోతుంది. దానికి మోడీ అవసరం లేదు. నేరుగా మోడీ వచ్చి లోకేష్ విమర్శిస్తే.. లోకేష్ స్థాయి పెరుగుతుంది . రాజకీయంగా విమర్శించాలంటే.. చాలా ఉంటాయి. కానీ… లోకేష్‌ కా పితాజీ.. అంటూ విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది..?.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విమర్శించడానికి చాలా ఉంటాయి. లోకేష్‌ను విమర్శించడానికి కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. చంద్రబాబునాయుడుగా.. తెలుసు. లోకేష్ తండ్రిగా కాదు. ఇలా చేసిన ఓ ప్రయోగం వల్ల.. మోడీ తన స్థాయిని తాను తగ్గించుకున్నారు. దీనికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా.. వ్యక్తిగత విమర్శలు చేశారు. భార్యకు విడాకులు ఇవ్వకుండా..మోడీ వదిలేశారన్నారు. మోడీ స్థాయి నేత వచ్చి.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న లోకేష్‌ను.. చంద్రబాబు కుటుంబాన్ని ఎగతాళి చేసేలా విమర్శలు చేయడం.. మోడీ రేంజ్‌ను సోము వీర్రాజు రేంజ్‌కి దిగజార్చాయి.

మోడీ.. ఏపీకి వచ్చినప్పుడు… ప్రజల డిమాండ్లయిన.. సమస్యల గురించి స్పందించాలి. అవి చెప్పకుండా.. అన్నీ చెప్పి.. చంద్రబాబుపై వ్యక్తిగత దాడి చేసి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది..? అలాగే చంద్రబాబు కూడా.. వ్యక్తిగత విమర్శల దాడి చేయడం కన్నా.. ప్రజల అంశాలు, విభజన హామీలు చర్చకు వచ్చేలా.. విమర్శలు చేయాల్సింది. అలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎలా చూసినా.. ప్రధానమంత్రి స్థాయిలోని నేత చేయదగిన వ్యాఖ్యలు.. గుంటూరులో మోడీ చేయలేదు. ఇదే దేశంలో ఆయనపై ఓ రకమైన ఏహ్యభావం పుట్టేలా చేశాయి. మోడీ క్రేజ్.. మరింత దిగజారిపోవడానికి ఇవి కారణం అయ్యాయి.