జగన్ 100 కాదు… 1000 కోట్లు పెట్టినా శిద్దాను ఓడించలేడా… దర్శిలో ఏం జరుగుతోంది…!

ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ రాజకీయాలు మంత్రి శిద్దా రాఘవరావుకు అనుకూలంగా ఒన్‌ సైడ్‌గా మారనున్నాయా ? అంటే అవుననే ఆన్సర్‌ దర్శి నియోజకవర్గంలో, ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లోనూ బలంగా వినిపిస్తోంది. దర్శి వైసీపీ రాజకీయం కొద్ది రోజులుగా ఢీలా పడుతూ లేస్తు వస్తోంది. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూస్తే దర్శిలో మంత్రి శిద్దా గ్రాఫ్‌ రోజురోజుకు స్కై రేంజుకు పెరుగుతుంటే వైసీపీ గ్రాఫ్‌ పడుతూ లేస్తు పడుతూ లేస్తు పాతాళానికి పడే స్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన శిద్దా నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గంలో టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చారు. అటు మంత్రిగా ఉండడం కూడా ఆయనకు నియోజకవర్గంలో బాగా కలిసి వచ్చింది. మంత్రిగా శిద్దా భారీగా నిధులు రాబట్టి దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశారు.

ఇటు స్థానికంగా నియోజకవర్గంలో శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్‌బాబు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పార్టీలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, బాధితులు / ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డంలో ఆల‌స్యం అయినా త‌న‌వంతుగా సహాయం చేసి న్యూట్రల్‌ కేడర్‌ను మొత్తం తమ వైపునకు తిప్పుకున్నారు. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి సాయం చేయ‌డం సుధీర్‌బాబు నైజం. శిద్దా చేసిన అభివృద్ధి పనులతో పాటు స్థానికంగా ఆయన తనయుడు సుధీర్‌బాబు ప్రజలకు అందుబాటులో ఉండి అందరి మన్ననలు అందుకున్నారు. శిద్దా దర్శితో పాటు ప్రకాశం జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న అనేక జిల్లా స్థాయి సమస్యల విషయంలో కావొచ్చు, జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించడంలోనూ నాలుగున్నర ఏళ్లలో తనదైన ముద్ర వేశారు. టీడీపీ సంగతి ఇలా ఉంటే విపక్ష వైసీపీలో పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో శిద్దాపై ఓడిపోయినా బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి శిద్ధా దూకుడు చూసి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఏడాదిన్నర క్రితమే చేతులు ఎత్తేసారు. రెండేళ్లుగా ఎవ్వరూ లేని అనాథలా మారిన దర్శి వైసీపీని జగన్‌ బాధం మాధవరెడ్డి చేతుల్లో పెట్టారు. మాధవరెడ్డి గట్టిగా నాలుగైదు నెలలు కూడా తిరగకుండానే పరిస్థితి అర్థం చేసుకున్నారు. శిద్దాపై పోటీ చేసి కోట్లు తగలేసుకోవడం తప్పా తాను ఇక్కడ గెలిచేది లేదని డిసైడ్‌ అయ్యి ఆయన ముందే అస్త్ర సన్యాసం చేశారు. మళ్ళీ దర్శి వైసీపీ మరో సారి నాయకుడు లేని అనాథలా మారింది. కొద్ది రోజులుగా గతంలో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఫేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరు తెర మీదకు వస్తోంది. తాజాగా జగన్‌ను కలిసిన మద్దిశెట్టి వచ్చే ఎన్నికల్లో శిద్దా మీద పోటీకి రెడీ అవుతున్నారని… జగన్‌ సైతం ఆయనకు గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చారని తెలిసింది. గతంలో ప్రజారాజ్యం నుంచి దర్శిలో పోటీ చేసి చేతులు కాల్చుకున్న మద్దిశెట్టి సైతం ఇప్పుడు దర్శిలో మనస్పూర్తిగా పోటీ చేసేందుకు ఇష్టంగా లేనట్టు తెలుస్తోంది.

ఒక వైపు శిద్దా దర్శిలో తిరుగులేని శక్తిగా ఉంటే ఇటు వైసీపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఓ వైపు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి ఫ్యామిలీ ఎంత వరకు సపోర్ట్‌ చేస్తుందో తెలియని సంకట‌ స్థితిలో ఆయన ఉన్నారు. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో మంత్రులను ఓడించేందుకు ప్రధానంగా టార్గెట్‌ చేసుకుంటూ వస్తున్న వైసీపీ అధినేత జగన్‌ మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాలు అయిన మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు, టెక్కలిలో అచ్చెన్నాయుడు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, కొవ్వూరులో కేఎస్‌. జవహర్‌, ఆచంటలో పితాని సత్యనారాయణ, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వేమూరులో నక్కా ఆనంద్‌ బాబు ఇలా వరస పరంపర‌ల్లో తాజాగా దర్శిలో సైతం శిద్దాను ఓడించేందుకు వేణుగోపాల్‌ను రంగంలోకి దించుతున్నారు. జగన్‌ ప్రయత్నాలు ఎలా ఉన్నా అసలు వేణుగోపాల్‌ శిద్దాకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నది వైసీపీ వాళ్లే చెప్పుకుంటున్న మాట. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. 2009ఎన్నికల్లో ఓడిపోయాక ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గ ప్రజలకు మొఖం చూపించడంగాని, అక్కడ సమస్యలు పట్టించుకోవడంగాని చెయ్యని వేణుగోపాల్‌ ఇప్పటికిప్పుడు తెర మీదకు వస్తే దర్శి జనాలు ఆదరించే పరిస్థితి కూడా లేదు. ఇటు చూస్తే జగన్‌ మాత్రం దర్శిలో నువ్వు శిద్దాను ఓడించాలంటే రూ. 100 కోట్లు పెట్టి అయినా శిద్దాను ఓడించాలి అందుకు నువ్వు సిద్ధమేనా అనగా వేణుగోపాల్‌ అవునని… కాదని అన్నట్టుగా తల ఊపినట్టు తెలుస్తోంది. ట్విస్ట్‌ ఏంటంటే దర్శిలో వేణుగోపాల్‌ అండ్‌ జగన్‌ కలిపి వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెట్టినా శిద్దాను ఢీ కొట్టి గెలిచే పరిస్థితి లేదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. పైన చెప్పుకున్నట్టు అంతలా శిద్దాతో పాటు ఆయన తనయుడు సుధీర్‌ నియోజకవర్గ జనాల మదిలో చొచ్చుకుపోయారు. పార్టీలకు అతీతంగా విపక్ష పార్టీలకు చెందిన వారు సైతం ప్రభుత్వ పథకాలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు ఇల్లు మంజూరులో సాయం చెయ్యడం లాంటివి అన్ని కలిసి వచ్చాయి. ఇక శిద్దా ఫ్యామిలీ పేరు చెబితే అవినీతికి పూర్తిగా దూరం అన్న నానుడి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏదేమైనా దర్శిలో జగన్‌ పార్టీ ఎంత తేడాతో ఓడుతుంది అన్నది మాత్రమే చూడాల్సి ఉంది.