కోర్టు చెప్పినా వెనక్కి తగ్గని కేసీఆర్.. ఆర్టీసీపై అనూహ్య నిర్ణయం

కేసీఆర్ అర్టీసీ విధానం పై  తను ఇచ్చిన వివరణ ఇక అర్టీసీ కార్మీకులకు తను ఇచ్చిన లాభాలని చేప్పుకున్నాడు.  అసలు వీలిలం చేయాల్సీన అవసరం లెదని అయన  తెలిపాడు. అయినా సరే అర్టీసీ కార్మికులు  పట్టూబట్టారని అయన తెలిపాడు. దినికి ఒకటే కారణం ఏపీలో అర్టీసీని విలినం చేయడమే అని అయన తెలిపాడు. అలాగే తెలంగాణా  ప్రభుత్వం అర్టిసీ కార్మీకులకు  ఇచ్చే సదుపాయలన్ని ఎపీ ప్రభుత్వం ఇస్తుందా అని అయన తెలిపాడు. ‘‘చేయాల్సిందంతా చేశాం. కార్మికులతో చర్చలు జరిపాం. వారు ససేమిరా అన్నారు. నన్ను కాదని సమ్మెకు దిగారు. మరో పక్క కోర్టుకు లెక్కలన్నీ చెప్పాం. అవన్నీ తప్పుడు లెక్కలే అంటోంది.

ఆర్టీసీకి చట్టబద్ధత లేదంటోంది. ఇప్పుడు మనం మాత్రం చేసేదేముంటుంది. ఈ నెల 11న కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేద్దాం’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులతో అన్నట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై శనివారం ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ హైకోర్టు ధర్మాసనం సూచించగా.. ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదంటూ కేసీఆర్‌ నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిసారీ ప్రభుత్వానివే తప్పుడు లెక్కలంటూ కోర్టు వ్యాఖ్యానిస్తోందని, చివరకు ఐఏఎస్‌ అధికారులు హాజరై వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆర్టీసీకి చట్టబద్ధత లేదనడం విస్మయం కలిగిస్తోందని, చట్టబద్ధత లేకపోతే.. ఇన్ని రోజులుగా సంస్థ ఎలా నడుస్తోందని సీఎం అన్నట్లు సమాచారం.

‘‘మరో పక్క కార్మికులు కూడా మెట్టు దిగడంలేదు. ఇప్పటికే ఐఏఎ్‌సల కమిటీ వేసి చర్చలు జరిపాం. పండుగ ముందు సమ్మెకు వెళ్లవద్దని సూచించాం. అయినా.. నా మాటను కాదని సమ్మెకు దిగారు. అప్పటికీ.. ఈడీల కమిటీ వేసి కోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చిస్తామని చెప్పాం. ఆ చర్చలను కాదని వెళ్లిపోయారు. ఇక చేసేదేముంది? మా చేతుల్లో ఏమీ లేదని కోర్టుకు వివరిద్దాం. కార్మికులే చర్చలకు రాలేకపోయారని చెబుదాం. ఏం తీర్పు చెబుతుందో చూసి, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేద్దాం’’ అని సీఎం అన్నట్లు తెలిసింది. ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, కమిషనర్‌ సందీ్‌పకుమార్‌ సుల్తానియా, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.