కాంగ్రెస్ కి రాములమ్మ ఊహించని షాక్…! టీడీపీ నుంచి కూడా…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రతి అంశంలో సూటిగా విమర్శలు గుప్పిస్తున్న అతికొద్దిమంది నేతలలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి ముందు వరుసలో వుంటారు. ప్రతి రోజు టిఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిలదీస్తున్న నేత రాములమ్మ. అలాంటి రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ కి షాకిచ్చారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీకి విజయశాంతి జై కొట్టనున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్ఎ్‌సకు చెందిన కొంతమంది ముఖ్యనేతలతో కమలం పార్టీ నాయకత్వం అంతర్గత మంతనాలు సాగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మాజీ ఉపముఖ్యమంత్రి ఒకరు, టీపీసీసీ ప్రచారకమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతితోపాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరనున్నారు.

పలు నియోజకవర్గాల్లో తమకు పట్టు లేని నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్‌, కాంగ్రె్‌సనుంచి నాయకులను చేర్చుకునేందుకు సాక్షాత్తూ పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన మొత్తం ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ డిప్యూటీ సీఎంతో పార్టీ నాయకత్వం టచ్‌లో ఉందని బీజేపీ అగ్రనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇప్పటికే చేరడానికి సన్నద్ధమైన నేతలతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎ్‌సకు చెందిన మరికొంత మంది ముఖ్యులతో బీజేపీ నేతలు చర్చిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఒకరు కొద్దినెలల కిందట టీఆర్ఎ్‌సలో చేరారు. ఈయన్ను కూడా బీజేపీలోకి పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్‌ ముఖ్యనేత ఒకరితో కూడా కమలం నాయకులు చర్చిస్తున్నారు. కాగా, నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలుసుకున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

ఆయన నిర్ణయాన్ని లక్ష్మణ్‌ స్వాగతించారు. 18న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా హైదరాబాద్‌ వస్తున్నారని, అదే సందర్భంలో పార్టీలో చేరాలని కోరినట్లు లక్ష్మణ్‌ తెలిపారు. అదే సమయంలో టీడీపీకి చెందిన పలువురు నియోజకవర్గ, జిల్లాస్థాయి నాయకులు 18న రాజ్యసభ సభ్యుడు గరిపాటి మోహన్‌రావుతో కలిసి బీజేపీలోకి చేరబోతున్నారు. ఇలా కాంగ్రెస్, టిడిపిల నుంచి భారీగా నాయకులను చేర్చుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది.

.