పవన్ వ్యతిరేకించే జగన్ ను చిరు కలవడం వెనుక అసలు వ్యూహం ఇదేనా..?

అంతా బానే వుంది. కానీ చిరంజీవి వేళ్లి వైఎస్ జగన్ ని కలవడం ఏమిటని అందరు అనుకుంటున్నారు. అసలు ఇప్పుడున్న పరీస్థీతులలో వైఎస్ జగన్ ని కలవడానికి ఏందుకు అంత ఉత్సాహం చుపిస్తున్నాడని అందరు అనుకుంటున్నారు. అదికాక వైఎస్ జగన్ కు సమయం లేక చిరంజీవి ని కలవడం ప్రస్తుతం కుదరదు అన్నట్టుగా వున్నా కానీ, పృధ్విరాజు ద్వారా రాయబారం పంపడం ఏందుకు అని అందరు అశ్చర్యపోతున్నారు. చిరంజీవి మామూలుగా వెళ్ళి కలెస్తే ఏం ఉండేది కాదు కానీ ఇలాంటి సమయంలో కలవడానికి ఎదురుచుడాల్సినంత అవసరం ఏమిటని అందరు అశ్చర్యపొతున్నారు. అదికాక ఇప్పుడు అయనకు రాజకీయలు ఏలా వుంటాయో అన్ని అర్థం అయ్యి ప్రస్తూతం రాజకీయాలకు చాలా దూరంగా వుంటున్నారు. అలాంటి చిరంజీవి వెళ్ళి కలవడం దెనికి అని అందరు అనుకుంటున్నారు.

చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగా ఉంటున్నాడు. అసలు పాలిటిక్స్ అనే పదమే వినబడనంత దూరంగా వెళ్లిపోయాడు మెగాస్టార్. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పాయిట్‌మెంట్ కోరడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం చిరంజీవికి ఏమొచ్చింది..? ఎందుకు ఇప్పుడు ఈయన జగన్‌తో భేటీ అవుతున్నారంటూ ఎవరికి వాళ్లు బుర్రకు పదును పెట్టేసారు. పైగా పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతీసారి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు, జగన్ భేటీ ఏంటి అంటూ నానా వార్తలు వచ్చాయి. అన్నింటికీ మించి అక్టోబర్ 11నే అనుకున్న అప్పాయిట్‌మెంట్ కాస్తా మూడు రోజులు ఆలస్యం కావడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు చివరికి అక్టోబర్ 14 లంచ్ బ్రేక్‌కు కలవబోతున్నారు జగన్, చిరంజీవి. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనేది అంతా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో.. ఈ ఇద్దరి భేటీపై కీలకమైన విషయాలు బయటికి చెప్పాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

చిరంజీవి, జగన్ మీటింగ్ వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని.. కేవలం సినిమా పరంగానే ఈ చర్చలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. సైరా సినిమా చూడ్డానికి ముఖ్యమంత్రిని చిరు ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాడని.. అందుకే అప్పాయిట్‌మెంట్ కూడా అడిగాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ తమిళిసైను ప్రత్యేకంగా ఆహ్వానించి షో వేసాడు మెగాస్టార్. ఇప్పుడు జగన్‌కు కూడా తన సినిమాను చూపించాలనుకుంటున్నాడు చిరు. ఏదేమైనా కూడా చిరు, జగన్ భేటీ మాత్రం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది.మరీ చుద్దాం భేటి తర్వాత ఏలాంటి విషయాలపై చర్చించారో చెపుతారు అని అందరు ఏదురుచూస్తున్నారు.