15 రోజుల్లోనే చింతమనేనిపై ఎన్ని కేసులు పెట్టారో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

సార్వత్రీక ఏన్నికలలో వైసీపి గెలిచాకా టీడీపీ మాజి ఏమ్మేల్యె చింతమనెని ప్రభాకర్ పై పెట్టిన కేసులు  చిట్టా ఆర్థశతకం దాటింది అంటే నమ్మగలరా అదే జరిగింది. గత ఆరు నెలలుగా అయన రిమాండ్ లోనే వున్నారు. ఒక కేస్ కీ బెయిల్ మంజురవ్వడం అలస్యం వెంటనే మరో కేస్ ఇలా ఆయనపై ఏన్ని కేస్ లు పేట్టాలో అన్ని కేస్ లు పేట్టారు. ‘ఎందుకీ రాజకీయ కక్ష… చివరికి బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తారా..ఈ ఐదు నెలల్లో అన్నీ దౌర్జన్యాలు, దుర్మార్గాలే. ఇకనుంచి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, కక్షపూరితంగా వ్యవహరించడం లాంటివి చేస్తే సహించేది లేదు’అని టీడీపీ నేతలు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

కక్షసాధింపుతో చట్టాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను మంగళవారంనాడు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, దాసరి ఆంజనేయులు కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఏదో ఒక విధంగా ఎదుటి పక్షాన్ని భయపెట్టి లొంగదీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘చింతమనేని ప్రభాకర్‌పై ఏకంగా 15 రోజుల వ్యవధిలోనే 13 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఇదెక్కడి న్యాయం. రాజకీయంగా అణగదొక్కేందుకే ఈ ప్రయత్నాలన్నీ’ అని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో ఏనాడైనా ఇలా వ్యవహరించామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతీ జిల్లాలోనూ కొందరిని టార్గెట్‌గా చేసుకుని, జాబితాలు రూపొందించి వేధిస్తున్నారంటూ ఆరోపించారు.

చింతమనేని ధైర్యం మిగతా కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. కక్షపూరితంగా వ్యవహరించడం ఏ పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని సూచించారు. కక్షపూరిత చర్యలను ఆపాలని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు.