ఫైల్ పై సంతకం చెయ్యాలి… ముఖ్యమంత్రి చెప్పాలి…!

తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పాత్ర ఏంటి అంటే… దానికి సమాధానం చాలా మంది నవ్వి ఊరుకుంటారు. జలవనరుల శాఖ సమావేశానికి ఆ శాఖ మంత్రే వెళ్ళలేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సమస్యలు పరిష్కారం కోసం నోచుకోని మాదిరిగా కొందరు మంత్రులు కూడా వారి శాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు… కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలల గడుస్తున్నప్పటికి ఏ ఒక్క శాఖలో కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు..

అదేమిటని ప్రశ్నిస్తే మంత్రుల నుంచి వచ్చే సమాధానం ఒక్కటే… మా చేతిలో ఏమీలేదు… మాకు సీఎం నుంచి ఆదేశాలు రాలేదు… కాబట్టి ఏం చెయ్యలేం అనే సమాధానాలు వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రులుగా వీరి పాత్ర ఏమిటి ప్రభుత్వం లో అని రాజకీయ వర్గాలలో కాస్త సీరియస్ గానే చర్చలు సాగుతున్నాయి… ఆయా శాఖలకు సంబంధించిన పనులు ఆగిపోవడం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉండగా,మాకు ఏ అధికారాలు లేవు సీఎం ఆదేశాలు వచ్చాకే వారి శాఖకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కదులుతాయి అనే మంత్రుల వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలి అని విపక్షాలు నొక్కి చెప్తున్నాయి.పోని సీఎం గారిని కలిసి ఆయన సమస్యను వివరించాలిఅని చెప్పి సీఎం ఆఫీసుకు వెళ్ళినవారికి ఆయన అందుబాటులో లేరు అన్న సమాధానం విని అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు…

ఈ రకమైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తారని వారిని తక్కువ అంచనా వేయవద్దని సూచిస్తున్నారు. ఇలా ఉంటే అసలు రాష్ట్రంలో పాలన ముందు ముందు ఇంకెలా ఉండబోతోంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి…