చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. టీడీపీ కీలక నేతపై వేటు

ఏపీలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏమ్మెల్యెగా పోటి చేసిన వ్యక్తి ని అతడి స్థానం నుండి బహిష్కరించాడు.గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేలపూడి స్టాలిన్‌బాబును నియోజకవర్గస్థాయి సమావేశం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందడంతోపాటు ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం పంపించిన పార్టీ ఫండ్‌ దుర్వినియోగమైందన్న ఆరోపణలు నేపథ్యంలో సోమవారం లంకల గన్నవరంలో జరిగిన సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తినే ఆ పార్టీ కేడర్‌ బహిష్కరిస్తున్నట్టు తీర్మానించడం వెనువెంటనే జిల్లా అధ్యక్షుడు ఆ తీర్మానానికి ఆమోదముద్ర వేసి కార్యకర్తల పట్టుతో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న స్టాలిన్‌బాబు ఈ విషయం తెలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంబాజీపేటకు చెందిన నేలపూడి స్టాలిన్‌బాబు గతంలో అప్పటి టీడీపీ ఎంపీగా పనిచేసిన పండుల రవీంద్రబాబు వద్ద పీఆర్‌వోగా పనిచేసేవారు.

ఆ సమయంలో స్టాలిన్‌బాబును జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్‌ మోనటరింగ్‌ కమిటీసభ్యుడిగా ఎంపీ రవీంద్రబాబు సిఫారసుపై నియమితులై ఆ పదవిలో సమర్థవంతంగా పని చేశారనే గుర్తింపు పొందారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై ప్రత్యేక పుస్తకాలు ప్రచురించడంతో పాటు పార్టీలో కీలకంగా మారి అధినేత చంద్రబాబుకు చేరువ య్యారు. జిల్లాలో ఉన్న అప్పటి మంత్రులు, పార్టీలో కీలకంగా చక్రం తిప్పే నేతల సహకారంతో గడచిన ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పార్టీ ఫండ్‌ దుర్వినియోగమైందనే ఆభి యోగాలు సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దే నియో జకవర్గ పార్టీ కేడర్‌ బహిరంగంగా ప్రస్తావించారు.ఇదే అంశం సోమవారం జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో తీవ్ర చర్చకు కారణమైంది. నిధుల దుర్వినియోగం అంశం తీవ్రంగా మార డంతో టీటీడీ మాజీ సభ్యుడు డొక్కా నాధ్‌బాబు పార్టీ ఫండ్‌ దుర్వినియోగంలో అందరినీ నిందించడం సరికాదని, అందుకు ఒకే ఒక్కడు ఆ ఒక్కడు ఎవరో మీకు తెలుసని బహిరంగంగా ప్రకటించడంతో సమావేశం ఉత్కంఠకు గురైంది. ఈ నేపథ్యం లో పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటూ అలిగి వెళ్లిన నేలపూడి స్టాలిన్‌బాబును పార్టీ నుంచి సాగనంపవ ల్సిందేనని పట్టుబట్టారు. దాంతో అధ్యక్ష హోదాలో ఉన్న నామన రాంబాబు చివరకు స్టాలిన్‌బాబును పార్టీనుంచి బహిష్కరి స్తున్నట్టు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో జరుగుతున్న పరిణా మాలు తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయని, నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్యనాయకుల నమ్మకద్రోహం వల్లే ఆర్థికపరమైన అంశాలు తన ఓటమికి ప్రభావం చూపించాయని టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన నేలపూడి స్టాలిన్‌బాబు ప్రకటించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు 10వ తేదీన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపినట్టు చెబుతున్నారు. పార్టీ ఓటమి చెందినప్పటికీ పార్టీ అభ్యున్నతికోసం అహర్నిశలు కృషిచేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.

తనకు పోటీగా వేరే వ్యక్తులను బయట నుంచి తీసుకొచ్చి పార్టీని విభజించిన తీరు బాధగా ఉందన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో టిక్కెట్‌ ఆశించేవారు గుర్రాల వలే పరిగెట్టాలంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలు తీవ్ర ఆవేదన కలిగించాయని, అందుకే పార్టీని వీడవల్సివస్తుందంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఆర్థికపరమైన అంశాలలో తలెత్తిన వివాదాలే స్టాలిన్‌బాబు దూరం కావడానికి కారణ మైనట్టు సమాచారం. అయితే 10వ తేదీన లేఖ పంపించినట్టు చెబుతున్నప్పటికీ సోమవారం సాయంత్రం నుంచే వెలుగులోకి వచ్చింది.