సక్షేమంలో బాంబు పేల్చిన చంద్రబాబు..!

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చెయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముక ఉండదు. ఆ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు తనలోని ప్రజా పాలకుడిని ఆవిష్కరించారు. తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి రోజు తెలుగు ప్రజల కళ్ళలో కాంతులు నింపే ప్రకటన చేశారు. పేదలకు, ఆధారం లేని ప్రజలకు సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. వారికి నెలనేలా ఇస్తున్న పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు.

చంద్రబాబు చేసిన ప్రకటన ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు ఇచ్చిన సంక్రాంతి కానుకపై సర్వత్రా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛను సొమ్ము రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫించనుదారులకు ఫిబ్రవరిలో పంట పండనుంది. పాత, కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో రూ.3వేలు అందించడమే ఇందుకు కారణం. మార్చి నుంచి అంతా రూ.2వేలు పింఛను తీసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా బోగూరులో నిర్వహించిన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమంలో సీఎం ఆయన ఈ సంచలన సంక్షేమ పధకాన్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులెవరూ అధైర్యపడొద్దని అప్పట్లో రూ.200గా ఉన్న పింఛనును రూ.1000కి పెంచామన్నారు. దాన్ని మరోసారి రెట్టింపు చేస్తూ జనవరి నుంచి నెలనెలా రూ.2వేలు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చానని గుర్తు చేశారు. నెలనెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో.. అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. వృద్ధులు, వితంతువులు వయోభారంతో, మందులు కొనుక్కొనేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే పింఛన్లు పెంచామన్నారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని.. తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు. తాను అధికారంలోకి వస్తే ఫించన్లు పెంచుతానని చెబుతున్న విపక్షనేత జగన్ ఇక కొత్త హామీలు వెతుక్కోవాల్సిందే