చంద్రబాబుపై సుజనా సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న టీడీపీ అభిమానులు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి.. పరిపాలన మీద కంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం మీదే ఫోకస్ చేసినట్టుగా ఉందన్నారు. ంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మరో మూడేళ్లలో జమిలి ఎన్నికలు రావొచ్చంటూ చంద్రబాబు నాయుడు నిన్న ఓ వ్యాఖ్య చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, జమిలి ఎన్నికల గురించి ఆయనకేం తెలుసన్నారు. రాజ్యసభ సభ్యుడినైన తనకే జమిలి ఎన్నికల గురించి తెలియదన్నారు. అమరావతి వివాదంపై రాజధాని రైతులతో కలసి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, మరికొందరు బీజేపీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి.. పరిపాలన మీద కంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం మీదే ఫోకస్ చేసినట్టుగా ఉందన్నారు. అమరావతి గురించి బొత్స కామెంట్స్ చేసి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ వల్ల రూ.500 కోట్ల ఖర్చు తగ్గుతుందని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నా.. దాని వల్ల రూ.5 కూడా తగ్గలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని సుజనా చౌదరి ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా ఐదేళ్ల పాలనా సమయాన్ని వృధా చేసిందన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని వ్యక్తిగతంగా శిక్షించాలే కానీ, ప్రాజెక్టులు ఆపడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే సుజనా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఈయన రాజ్యసభ ఎంపీ అయ్యింది టీడీపీ నుండి కాదా అని ప్రశిస్తున్నారు. పార్టీ మారినంత మాత్రాన ఒక మాజీ ముఖ్యమంత్రికి అంత తక్కువగా చేసి మాట్లాడటం సరికాదన్నారు

"
"