నేషనల్ మీడియా చెప్పినా పట్టించుకోని జగన్.. నిండా మునగడం ఖాయం

ఏపీలో వైఎస్ జగన్ సీయం అయినప్పటినుండి దూకుడుగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ కొన్ని విషయాలలో మాత్రం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో  ఏక్కువగా అతడు చేసిన తప్పులు గురించే చేప్పుకుంటున్నారు.  పీపీఏ అగ్రిమెంట్ ని  టచ్ చేయడం  ఇక అలాంటివి చాలా జరిగాయి. వైఎస్  జగన్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నవారు ఐదునెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రెండు జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన సంపాదకీయాలను శనివారం ట్విటర్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంపై తన ముద్ర చెరిపే ప్రయత్నంలో తిరోగమనం పట్టిస్తున్నారని ఈ సంపాదకీయాల్లో వ్యాఖ్యానించినట్లు తెలిపారు. తనమీద కక్షతో తాను నిలబెట్టినవాటిని కూల్చే పనిని ఆపి ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలని జగన్‌ ప్రభుత్వానికి సూచించారు. పాత్రికేయులకు.. పత్రికారంగంలో పనిచేస్తున్న వారికి ఆయన జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో, భారతీయుల ఆకాంక్షలను ప్రతిఫలింపచేయడంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు చక్కటి కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. ఆదినుంచి టీడీపీ పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, పత్రికల గొంతు నులిమే జీవో 938, జీవో 2430 వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో 2430ని రద్దుచేసి భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని పత్రికా దినోత్సవం సందర్భంగా కోరుతున్నానని చెప్పారు.జగన్‌ ప్రభుత్వం చౌక ధరకు ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టిందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కొనే అవకాశాన్ని కూడా కేవలం జగన్‌ అనుయాయులకే పరిమితం చేశారని శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ భూములను తన తాబేదార్లకు అమ్మేసి వచ్చిన డబ్బుతో నవరత్నాలు అమలు చేస్తానని జగన్‌ చెప్పడం ఒక వింత. భూములమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్న పెద్ద మనిషిని తొలిసారి చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములే స్వల్పం. వాటిని అమ్మేయడం అంటే ప్రభుత్వాన్ని దివాలా తీయించడమే. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గనుల లీజులను మంత్రులు, వారి బినామీల పరం చేస్తున్నారు. ముగ్గురాళ్ల నుంచి ఇనుప ఖనిజం వరకూ మైనింగ్‌ దోపిడీలో ఆరితేరిన జగన్‌ కుటుంబం ఇప్పుడు మళ్లీ మైనింగ్‌నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇసుక కృత్రిమ కొరత ఈ దోపిడీలో భాగమే.లక్షన్నర టన్నులకు కేవలం 30వేల టన్నుల ఇసుక మాత్రమే తీస్తున్నారు. దానిని ఐదురెట్ల అధిక ధరకు అమ్ముతున్నారు. లారీ ఇసుక రూ.80వేలకు చేరుకోవడం వీరి దోపిడీ స్థాయికి నిదర్శనం. ఇసుకంతా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే కూలీలుకూడా పనుల కోసం తరలిపోవాల్సి వస్తోంది. కరెంటు ధర, భూమిశిస్తు పెంచి వారిపై భారం మోపే ఆలోచనలు జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్లు మూసివేశారు. పండుగ కానుకలు తీసివేశారు. గిరిజనులకు ఫుడ్‌ బాస్కెట్‌ ఎత్తివేశారు. 5లక్షల మంది ఆటోడ్రైవర్లలో లక్షన్నర మందికే రూ.10వేలిచ్చి చేతులు దులుపుకొన్నారు. రైతు భరోసాలో కేంద్రంఇచ్చిన డబ్బులు కూడా కలిపేసి రైతులను రూ.20వేల కోట్లు మోసం చేశారు. పింఛను రూ.250మాత్రమే పెంచి పేదలను రూ.పదివేల కోట్ల మేర మోసగించారు.

6నెలల్లో 2.5లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంటే 250 ఇళ్లయినా కట్టలేదు’ అని దుయ్యబట్టారు. 5నెలల్లోనే రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించారని, పెట్టుబడిదారులు.. సంస్థలు వెనక్కి మళ్లుతున్నాయని.. చివరకు బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి జంకుతున్నాయని చెప్పారు. ఇప్పుడే రాష్ట్రాన్ని దక్షిణాది బిహార్‌ అని పిలిచే స్థితిని జగన్‌ ప్రభుత్వం తెచ్చిందని, రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారని వాపోయారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన ఐదేళ్లకు రాజధాని ఎక్కడో తేల్చడానికి కమిటీ వేయడం తుగ్లక్‌ చర్యని విమర్శించారు. స్వల్పకాలంలో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదని యనమల పేర్కొన్నారు.