చంద్ర‌బాబులో ఇంత హుషారా… వాళ్లంతా ఫుల్ జోష్‌

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జిల్లాల పర్యటనలో బిజీ గా ఉన్నారు. వరుసగా జిల్లాలను పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో ఆ క్యాడర్ లో ధైర్యం నింపడమే కాదు ఏ విధంగా ప్రభుత్వంపై పోరాడాలి అనే దాని మీద దిశా నిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాల్లో ఆయన ఇప్పటికే పర్యటించి సమీక్షా సమావేశాలు జరిపారు. కార్యకర్తలతో కూడా నేరుగా మాట్లాడారు.అయితే ఈ పర్యటనలకు ముందు చంద్రబాబులో ఒకరకమైన ఆందోళన అనేది కనపడింది. పార్టీ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆయన కాస్త కంగారుగా ఉండే వారు అనేది వాస్తవం.

అయితే ఇప్పుడు చంద్రబాబులో ఆ భయం కనపడటం లేదని క్యాడర్ అంటుంది. కార్యకర్తలతో ఆయన మాట్లాడే సమయంలో హుషారుగా మాట్లాడుతున్నారు. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో మాత్రం చంద్రబాబులో హుషారు కనపడుతుంది.పార్టీ ఓడిపోయింది.. 23 సీట్లే వ‌చ్చాయ‌న్న ఆందోళ‌న బాబులో ఎంత మాత్రం లేదు. దీనికి ఇప్పుడు అనేక కారణాలు చెప్తుంది తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత దారుణంగా పెరిగిందని అ విషయం చంద్రబాబుకి అర్ధమైందని కీలకమైన కేంద్రం కూడా జగన్‌కు దాదాపుగా దూరంగా ఉందని, ప్రభుత్వం నడపాలి అంటే భవిష్యత్తులో చాలా కష్టమనే విషయం అటు వైసీపీ వాళ్ల‌కు, ఇటు ప్ర‌జ‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక జగన్ బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక క్యాడర్ కూడా ఉత్సాహంగా రావడంతో చంద్రబాబులో పార్టీ భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడిందని అంటున్నారు. ఇక ఆరు నెల‌ల్లోనే వైసీపీపై ఇంత వ్య‌తిరేక‌త ఉంటే ఇది యేడాది కాలానికి మ‌రింత తీవ్ర అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ధీమా కూడా బాబులో ఫుల్ జోష్ నింపుతోంది.