చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ ప్రభుత్వం

ఏపీలో  టీడీపీ పరీస్థీతి రోజురోజుకు  దిగజారుతుంది. ఇప్పుడు  ప్రతిపక్ష హాదాలో వున్న పార్టి కి ఒక దీక్ష చెయ్యడానికి కూడా అవకాశం లేకుండా అయ్యింది. నారా చంద్రబాబు నాయుడు  దీక్ష చేయాలని  డిసైడ్ అయ్యాడు.టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను, మున్సిపల్‌ కమిషనర్‌ను టీడీపీ నేతలు కోరారు. అయితే స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అధికారులు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా చంద్రబాబు దీక్ష జరిగి తీరుతుందని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు.

దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నేతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ధర్నాచౌక్‌ను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ఈనెల 14న విజయవాడలో దీక్ష చేపట్టాలని మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నారా లోకేష్ కూడా దీనిపై దీక్ష చేశారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా ఈనెల 3న విశాఖలో లాంగ్‌మార్చ్‌ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయినా ఇంకా రాష్ట్రంలో ఇసుక కొరత తీరకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఈనెల 14న ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ శ్రేణులు దీక్షకు అనుకూలమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.