స్థానిక స‌మ‌రానికి బాబు ఏ రేంజ్‌లో రెడీ అవుతున్నారంటే

వ‌చ్చే నెల‌లో రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంరంభం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాదిలో జ‌రిగిన సార్వ‌త్రిక స‌మ‌రంలో టీడీపీ అనూహ్య ప‌రాజ‌యం పొందింది. దీంతో అధికారంతోపాటు పార్టీ ఉనికి కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు కు అగ్ని ప‌రీక్షే ఎదురైంది. పార్టీని నిలుపుకోవ‌డం, త‌మ్ముళ్ల‌లో భ‌రోసా క‌ల్పించ‌డం ఆయ‌న‌కు ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యాలు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటాలు ప్రారంబించారు. అయినా కూడా పార్టీ పుంజుకునే ప‌రిస్థితి పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

దీంతో ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు బాబు కు క‌లిసివ‌స్తాయ‌నిభావిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డం ద్వారాత‌న‌పై వ్య‌క్తిగ‌తంగాను, పార్టీపైనా వ‌స్తు న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు.ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే స్థానిక స‌మ‌రానికి బాబు ఇప్ప‌టి నుంచే త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా పార్టీలో యువ‌త‌ను వినియోగించుకునేందుకు బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ నాయ‌కుడు జ‌గ‌న్ యువ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌ను ఢీకొట్టేందుకు యువ‌త‌ను పెద్ద ఎత్తున వినియోగించుకోనున్నారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌ను కూడా బాబు ఈ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.స్థానిక సంస్థ‌ల అజెండాతో ముందుకు వ‌చ్చి ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీలో ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆయ‌న ఇప్ప‌టికే వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై పోరును మ‌రింత తీవ్రం చేయాల‌ని ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల‌ను తిరిగి పార్టీ ద‌క్కించుకుంటుందా? లేక వైసీపీ దూకుడు కొన‌సాగుతుందా అనేది ఆస‌క్తిగా మారింది.

"
"