ఈ తెలివి ముందే ఉంటే బాగుండేది.. జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో ఇసుక కొరత విషయంలో భవన కార్మీకులు లక్షల సంఖ్యలో భాదలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ తీరుపై ప్రతిపక్షాలు పోరాడుతున్న విషయం తెలిసిందె. కాని ఇప్పుడు వైఎస్ చంద్రబాబు కూడా దీక్ష చేపట్టడానికి మోత్తం సిధ్ధం చేసుకున్నాడు.ఇసుక సమస్యపై తాను చేస్తున్న దీక్షతోనైనా జగన్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేవాలని కోరుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం తాను విజయవాడలో ఇసుక దీక్ష చేపడుతున్నానని ప్రకటించగానే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు ప్రకటించిందని.. ఇసుకను కాస్తో కూస్తో అందుబాటులోకి తేవడానికి పరుగులు తీస్తున్నారని ఎద్దేవాచేశారు. ఈ తెలివి ముందు నుంచీ ఉంటే ఇన్ని లక్షల మంది కార్మికులు ఆకలిమంటలకు గురయ్యేవారు కాదని.. ఇంత మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదని తెలిపారు.

గురువారం బెజవాడ ధర్నాచౌక్‌లో ఆయన 12 గంటల దీక్ష చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లారీ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇక్కడి ఇసుకను హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి సరఫరా చేస్తూ కోట్లు గడిస్తున్నారని మండిపడ్డారు.‘గతంలో ఆహార కొరత, నీటి కొరత, కరెంటు కొరత విన్నాం తప్ప ఇసుక కొరత గురించి ఏనాడూ వినలేదు. దానిని కూడా సృష్టించి ఇసుకను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత వైసీపీ నేతలకే దక్కింది. బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవలసిన పరిస్థితి తెచ్చారు. గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధిక ధరకు ప్రజలు ఇసుకను కొనుక్కోవలసి వస్తోంది. ఇసుకను తక్కువ తీసి కృత్రిమ కొరత సృష్టించారు. 35 లక్షల మంది కార్మికులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు’ అని దుయ్యబట్టారు.స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగు మందు తాగుతున్నారని.. ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు పెట్రోలు సీసాలతో వెళ్తున్నారని చంద్రబాబు తెలిపారు. ‘వైసీపీ నేతల వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు. నిన్న పెద్దదోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరం. ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న బెదిరింపులే దీనికి కారణం’ అని విరుచుకుపడ్డారు.ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ తరపున పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

ఇసుక కొరతపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన పోరాట కమిటీలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అఖిలప్రియ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బండారు సత్యనారాయణమూర్తిలను సభ్యులుగా నియమించారు.తప్పుడు కేసులపై విచారణ జరిపించండి ‘‘కర్నూలు జిల్లాలో మాజీమంత్రి భూమా అఖిలప్రియ భర్తతోసహా 40 మంది టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు’’ అంటూ టీడీపీ నాయకులు మంగళవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు అఖిలప్రియ, వర్ల రామయ్య, కేశినేని నాని, నిమ్మల రామానాయుడు తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.