చంద్రబాబు ఎఫెక్ట్.. సక్సెస్ అయిన చలో ఆత్మకూరు..

నిన్న జరిగిన చ్లో అత్మకురు  ప్రోగ్రాం విజయం సాధించింది ఏలాగంటారా అసలు మ్యాటర్ ఇడే చూడండి. ఎమిటంటే మనం చిన్న లాజిక్ మిస్ అయ్యాం ఎలాగంటే అసలు టీడీపి ప్రభుత్వం అత్మకురు వెళ్ళనివ్వకుండా అందరీని  అడ్డుకున్నారంటే  అసలు వైసీపి నాయకులు ఎంత భయపడ్డారో అర్థం అవుతుంది.టీడీపీ చేపట్టిన ‘చలో ఆత్మకూరు’కు కొంత ఫలితం లభించింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న బాధితులను పోలీసు అధికారులు బుధవారం ప్రత్యేక వాహనాల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని నిలువరించాలని అధికార పక్షం, కొనసాగించాలని ప్రతిపక్షం రెండు మూడు రోజుల ముందు నుంచీ వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేశాయి. ఆత్మకూరు బాధితుల సమస్యకు బాగా ప్రచారం రావడంతో పోలీసులు ఆ గ్రామంలోని వైసీపీ నేతలను పిలిపించి మాట్లాడారు.

గ్రామం వదిలిన బాధితులను మళ్లీ తీసుకువస్తామని… వారిపై మరోసారి దాడులకు దిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. సమీప గ్రామాల్లో తలదాచుకొంటున్న 15 కుటుంబాల వారిని పిలిపించి రాజీ చర్చలు జరిపి, వారిని ఆ గ్రామానికి పంపారు. గుంటూరులోని టీడీపీ శిబిరంలో ఉన్న మిగిలిన గ్రామాలవారితో కూడా పోలీసు అధికారులు చర్చలు జరిపారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని టీడీపీ నేతలు చెప్పారు. దీనికి పోలీసు అధికారులు అంగీకరించలేదు. ఈ చర్చలు తెర వెనుక మంగళవారం రాత్రి వరకూ జరుగుతూ వచ్చాయి. చర్చలు ఫలించకపోవడంతో చలో ఆత్మకూరు కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారు. దీనిని పోలీసులు భగ్నం చేశారు. శిబిరంలో బాధితులు ఉన్నంత కాలం ఈ సమస్య ఇంతే ఉంటుందని గ్రహించిన పోలీసు అధికారులు, బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనాలు పెట్టి బాధితులను స్వగ్రామాలకు తరలించారు. ఈ పరిణామంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. తమ ఒత్తిడి పనిచేసి బాధితులు స్వగ్రామాలకు వెళ్లగలిగారని నేతలు చెప్పారు. ఆయా గ్రామాల్లో బాధితులకు తగిన రక్షణ అందుతోందీ లేనిదీ కొన్నిరోజుల పాటు పర్యవేక్షించాలని, అవసరమైతే ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు.హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాహనాన్ని ఆంధ్ర పోలీసులు గుంటూరు జిల్లా ఆత్మకూరు నుంచి నేరుగా నల్లగొండ సమీపానికి తీసుకొచ్చి వదిలివెళ్లారు. చంద్రబాబు కార్యాలయం సూచన మేరకు టీడీపీ-టీఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌.దుర్గాప్రసాద్‌ వాహనాన్ని మిర్యాలగూడలోని తన నివాసం వద్దకు తరలించారని టీడీపీ నేత బక్కని నర్సింహులు తెలిపారు.

పోలీసులు వాహనం అద్దాలు ధ్వంసం చేశారని.. డ్రైవర్‌పై దౌర్జన్యం కూడా చేశారని ఆరోపించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విలేకరులకు వివరించారు. పల్నాడులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోందని, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అయినా వినకుండా రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు అటువైపు వెళ్తే మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంద్రబాబును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవలసి వచ్చిందని తెలిపారు. టీడీపీ నేతల్ని కూడా శాంతి భద్రతల నేపథ్యంలోనే అడ్డుకున్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.

"
"