చంద్రబాబు భద్రత… హైకోర్టు తాజా ఆదేశాలు

వైసీపీ అధికారం చేపట్టగానే తీసుకున్న తొట్టతొలి నిర్ణయం మాజీ సీఎం చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడం. నక్సల్స్ దాడి నుంచి బయటపడి జెడ్ ప్లస్ కేటగిరీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న మాజీ సీఎం, సీనియర్ నేత భద్రతను వైసిపి సర్కారు ప్రమాదంలోకి నెట్టిందని టీడీపీ ఆరోజు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు న్యాయస్థానంని ఆశ్రయించారు.

దీనిపై విచారణ పూర్తి చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బుదవారం తుది ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు భద్రతను 97 మందితో కొనసాగించాలని ఆదేశించింది.ఒక సీఎస్ వోనే కొనసాగించాలని, కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని సూచించింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని స్పష్టం చేసింది. బుధవారం చంద్రబాబు భద్రత పిటీషన్ పై విచారించిన హైకోర్టు ప్రభుత్వం, చంద్రబాబు తరపు వాదనలు విన్న అనంతరం తీర్పు వెల్లడించింది.చంద్రబాబు భద్రతకు సంబంధిందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని ఆదేశించింది. కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది.

క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.