సీబీఐ అనుకుంటే నీ బ్రతుకెంత.. జగన్ కు షాకిచ్చిన కీలక నేత

రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నెతల మధ్య ఇప్పుడు విమర్శలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అసలు వైసీపీ మంత్రి కొడాలి నాని టీడీపీ మాజిమంత్రి దెవినెని ఉమామహేశ్వరరావ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందె. దానికి దెవినెని ఉమామహేశ్వరరావ్ కూడా కౌంటర్ ఇచ్చాడు.ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్ చిటికేస్తే టీడీపీ పార్టీ వైసీపీ స్టోర్ రూమ్‌లో ఉంటుందని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు… టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు.

జగన్‌ చిటికేస్తే తెలుగుదేశం పార్టీని వైసీపీ స్టోర్‌ రూమ్‌లో పెడతామంటూ… మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ చిటికేస్తే జగన్‌ భవిష్యత్‌ ఏమవుతుంది, వైసీపీ బతుకు ఏమవుతుందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ముందు మీ సంగతి చూసుకోవాలని ఆయన వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.టీడీపీకి ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారనే విషయం వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని దేవినేని ఉమ అన్నారు. టీడీపీకి అధికారం, ప్రతిపక్షం రెండు కొత్తకాదని గుర్తు చేశారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు సీఎం జగన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న పరీస్థీతులపై టీడీపీ నెతలు తీవ్ర విమర్శలు చేస్తునే వున్నారు.

అదికాకుండా వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రాష్ట్రంలో వున్న ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానికి వైసీపీ నెతలు కూడా మేం అన్ని బాగా చేస్తున్నాం అని  సమాధానం ఇస్తున్నాయి. దినితో ఇక్కడ విమర్శలు ప్రతివిమర్శలతో రాష్ట్రం హారెత్తుతుంది.