బొండాకు ఝులక్.. ఆ యువనేతకు వల..! బెజవాడ టీడీపీలో జరుగుతోంది ఇదే..!?

విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు… పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం ఇస్తామని … బేరం పెట్టడంతో.. ఓ టీడీపీ యువనేత తన సన్నిహితులతో.. గత ఐదారు రోజులుగా తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ విషయం.. బయట విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ…. ఆయన ఎలాంటి ఖండన ప్రకటనలు చేయలేదు. దాంతో ఆయన పార్టీ మార్పు కోసమే..మొగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు. దీనిపై.. ఒకటి, రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. నిజానికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమను.. వైసీపీలోకి తీసుకోబోతున్నారని.. […]