ఈ ఆగస్టులో ఏం జరుగుతుంది.. టీడీపీ శ్రేణుల్లో ఆందొళన

మామూలుగా టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా అగస్టు సంక్షోభం అనేది ఎప్పుడూ ఒక చర్చగా మారుతుంది. ఇప్పుడసలే టీడీపీ భారీ ఓటమితో ఉంది. చంద్రబాబు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయింది ఆగస్ట్ లోనే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను దించి.. చంద్రబాబునాయుడు సీఎం అయింది కూడా ఆగస్ట్ నెలలోనే. తెలుగుదేశం ప్రభుత్వానికి మాయని మచ్చలాంటి బషీర్ బాగ్ కాల్పుల ఘటన […]

పోలవరం కాంట్రాక్టు సంస్థపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

పోలవరం ప్రొజెక్టుపై జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ Mముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ ప్రొజెక్టు పనుల కొనసాగింపుపై అనేజ అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ వెళ్లిన జగన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తామని ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో నాలుగు రోజులకే మనసు మార్చుకున్నారు. కేంద్రానికి అప్పగించేది లేదని తామే దానిని పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారు. అయితే పోలవరం […]

బాబు చర్య రాజ్యాంగబద్దం… జగన్ తీరు దారుణం… బీజేపీ వ్యాఖ్యలు

కాపు కోటాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని గట్టిగా సమర్ధించుకుంటున్నారు. పాదయాత్రలో ఉండగా కాపులను బీసీల్లో చేర్చడం కుదరదని చెప్పి వారి ఆశలపై నీళ్లు పోసిన వైసిపి అధినేత అధికారంలోకి రాగానే మాజీ సీఎం చంద్రబాబు ఇచ్చిన కాపు కోటాపై సంచలన ఆదేశాలు ఇచ్చి రిజర్వేషన్లలో వారికున్న అవకాశాలను దెబ్బ తీశారు. చంద్రబాబు ఇచ్చిన అయిదు శాతం రిజర్వేషన్ ను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ వర్గం ప్రజల్లో కలవరానికి దారి […]

టిఆర్ఎస్ కి చుట్టుకున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ ఉచ్చు…!

ఒకవైపు రాజకీయంగా బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుకోని చిక్కు ఎదురైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక వర్గాల నుంచి తన పాలనపై కేసీఆర్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని హైద్రాబాద్ జంట నగరాలు సహా పలు జిల్లాలలో విస్తరించి అరాచకాలు సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఉదంతం ఇప్పుడు టిఆర్ఎస్ నేతలకు చుట్టుకుంది. నయీమ్ ని అంతమొందించడంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించారని అప్పట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే […]

వైసీపీలో హాట్ టాపిక్.. బాలయ్య సీటుపై అంత అసక్తి ఎందుకు..?

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అవీర్భావం నుండి హిందూపురం సీటు ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి.  హిందూపురం నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించిన బాలకృష్ణ… రెండుసార్లు వేర్వేరు ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా వీచిన వైసీపీ హవాను తట్టుకుని కేవలం కొంతమంది టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాయలసీమలో జగన్ ప్రభంజనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సహా కేవలం ముగ్గురు నేతలు మాత్రమే తట్టుకున్నారు. అందులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ […]

ఫృధ్వీ అలా.. పోసాని ఇలా..! టాలీవుడ్‌పై ఇదో రకం బెదిరింపులా..?

ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినంందుకు.. జగన్‌కు మద్దతుగా మాట్లాడినందుకు తనకు సినిమా చాన్సులు కూడా రావడం లేదని.. ప్రచారం చేసుకున్నారు. దాంతో ఆయనకు.. జగన్మోహన్ రెడ్డి.. ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి ఇచ్చి ఉపాధి చూపించారు. ఈ ఉత్సాహంలో ఫృధ్వీ టాలీవుడ్ పెద్దలపై తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం.. వారెవరికీ ఇష్టం లేదన్నారు. ఇంత వరకూ.. జగన్‌కు ఒక్క సారి కూడా.. శుభాకాంక్షలు చెప్పలేదని గుర్తు […]

పవన్ మరో సంచలనం.. జగన్ పై దిమ్మతిరిగే కామెంట్స్

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వానికి కొన్ని రోజులు మాత్రమే సమయమిచ్చారు. రాజమహేంద్రవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు జనసేనాని. ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? వీళ్లెవరూ తిరగరని విమర్శించారు.ప్రజల మధ్య నాయకులు ఉండాలని, ప్రతిరోజూ ప్రజలను […]

జీసస్‌ దగ్గరకు వెళ్లడానికి జనం సొమ్మా..! దొరికిపోయిన జగన్

జగన్మోహన్ రెడ్డి ఒకటో తేదీ వెళ్తున్నారు.. నాలుగో తేదీ తిరిగి వస్తారు. జీసస్ జన్మస్థలంలో ఆయన రెండు రోజుల పాటు ఉంటారు. ప్రార్థనల్లో పాల్గొంటారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో.. ఆయన కార్యదర్శి ధనుంజయరెడ్డి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మాత్రమే జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్తున్నారు. అయినప్పటికీ.. అక్కడ భద్రతా ఏర్పాట్ల కోసం.. రూ. 22 లక్షల 50 వేల రూపాయలు విడుదల చేశారు. బహుశా… వ్యక్తిగత పర్యటనకు… ప్రభుత్వ నిధులు ఎలా వాడతారన్న విమర్శలు […]

బెజవాడ ఎయిర్‌పోర్టు ప్రైవేటు పరం..! ఇదేనా క్లైమాక్స్…?

మెట్రోపాలిటన్‌ నగరాల విమానాశ్రయాలకు దీటుగా ఎదుగుతున్న విజయవాడపై కేంద్రం కన్నుపడింది. ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. విమానాశ్రయ సంస్థలకు కాసులు కురిపిస్తున్నా .. ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జా తీయ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరణ బాట పట్టించటానికి కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేయటం విస్మయాన్ని గొలుపుతోంది. వరుసగా రెండోసారి పూర్తి మెజారి టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వం లోని కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణకు తలుపులు తెరిచింది.ఈ క్రమంలో అనేక కేంద్ర […]

విశాఖ విమానాశ్రయంలో జగన్‌ను అడ్డుకున్న ఖాకీలకు షాక్‌!

రెండున్నరేళ్ల కింద వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు సరండర్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2017 జనవరి 26న విశాఖ బీచ్‌రోడ్డులో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ప్రకటించారు. గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన నగర పోలీసులు విశాఖ రావద్దని ఆయన్ను కోరారు. అయినా […]