కేంధ్రానికి లేఖ.. అక్కడికి రాలేనని తేల్చేసిన చంద్రబాబు

‘‘దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ కోవిదులు, న్యాయ నిపుణులు నిశితంగా అధ్యయనం చేయాల్సిన అంశం. ఈ విషయంలో దేశానికి ఏది హితమో అది అన్ని రాజకీయ పార్టీలతో విస్తృతంగా చర్చించాలి. అందరికీ సమ్మతమైన రీతిలో చేయాలి’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష భేటీ జరగనుంది. దీనిలో ఒకేసారి ఎన్నికలు అంశంతో పాటు వివిధ విషయాలు చర్చకు రానున్నాయి. ముందుగానే ఖరారైన […]

అసెంబ్లీలో జగన్… చంద్రబాబు చేసిన ప్రసంగంతో హోదా సంగతి తెలిపోయింది

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని పదేపదే అడుగుతుంటామని అంతకుమించి చేసేదేమీ లేదని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చెప్పినట్లే జగన్ మాత్రం మొన్న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో హోదా అంశాన్ని తన ప్రధాన అజండాగా ప్రస్తావించారు. తాజాగా మరో అడుగు ముందుకేసి అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం తరపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు […]

అర్ధరాత్రి టీడీపీ నేతలపై దాడులు… గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గెలుపు ఊపుతో ఉన్న అధికార పార్టీ కార్యకర్తలు… ఓటమి భారంతో ఉన్న టీడీపీ కేడర్ పై కవ్వింపులకు దిగుతూనే వున్నారు. ప్రశాంతంగా వుండే శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు ఎం టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేయడం సరైంది కాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి దాడులు నిర్వహిస్తే తగిన బుద్ధి చెబుతామని […]

ప్రత్యేక హోదాపై జగన్ కౌంటర్… చంద్రబాబు రివర్స్ కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం మరోసారి అసెంబ్లీలో వేడి పుట్టించింది. రాష్ట్రం కోసం రాష్ట్రానికి హోదా తేవడం కోసం అన్ని విధాలా సహకరిస్తామని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ హోదా కోసం సభలో తీర్మానం పెట్టిన సందర్భంగా ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రానికి హోదా ఆవశ్యకతను ప్యాకేజికి తాము ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చంద్రబాబు మరోసారి వివరించారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నామని ఆయన […]

అమిత్ షా ప్లానింగ్.. రామ్‌మాధవ్ అమలు..! తెలంగాణలో భారీ స్కెచ్

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడుతుండటం.. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీజేపీ నేరలు అంచనా వేస్తున్నారు. రామ్‌మాధవ్ ద్వారా అమిత్ షానే… తెలంగాణలో పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ రూట్స్ బలంగా ఉండటంతో ఈజీగా బలపడొచ్చని అమిత్ షా భావిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. తాజాగా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో అమిత్ షా ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సహా.. తెలంగాణలో […]

పరిష్కరించుకోవడం అంటే ఇచ్చేయడమేనా..? జగన్ తీరుపై రచ్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సమన్వయంతో.. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే..హైదరాబాద్‌లోని ఏపీ భవనాల సమస్య పరిష్కారం అయింది. జలవివాదాలను… శరవేగంగా పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్ కూడా.. గతం.. గతహా అనుకుని.. భవిష్యత్ పై దృష్టి సారిస్తున్నారు. ఎగువ రాష్ట్రంతో కలిసి.. ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకుందామనుకుంటున్నారు. ఇవే కాదు.. మిగిలిన అన్ని సమస్యలపైనా… నెల రోజుల్లో ఓ పరిష్కారానికి రావాలన్న ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఏపీ, […]

బీజేపీ రియల్ కింగ్ అమిత్ షా..! అక్కడా.. ఇక్కడా ఆయనే..!

ప్రభుత్వంలో.. ఇటు పార్టీలో… అమిత్ షా… అత్యంత బలమైన వ్యక్తిగా మారారు. ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉంటూ.. నెంబర్ టూ పొజిషన్‌కు వెళ్లారు. దాదాపుగా అన్ని మంత్రి వర్గ ఉపసంఘ కమిటీల్లోనూ ఉన్నారు. ప్రతీ శాఖలోనూ ఆయనకు అధికారాలు ఉన్నాయి. అలాగే.. పార్టీ అధ్యక్ష పదవికి ఆయనే ఉండాలంటూ… ప్రచారం చేయించుకోగలిగారు. చివరికి ఆయనే కొనసాగుతున్నారు. అంటే.. అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ఆయన సుప్రీంలీడర్‌గా మారుతున్నారు. ఇది.. బీజేపీ సీనియర్లకు మింగుడు పడకపోయినా.. చేయగలిగేదేమి లేని.. పరిస్థితి. […]

ఆయన కూడా చంద్రబాబులాగే చేస్తారట..! బీజేపీతో ఎంత డేంజరో ఇంకా తెలియలేదా..?

బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఐదేళ్ల తర్వాత పరిస్థితిని అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. మరో ఐదేళ్లకు..కచ్చితంగా మోదీపై..దేశ ప్రజల్లో విరక్తి వస్తుందని.. అప్పుడు.. క్లీన్ ఇమేజ్ తో తాను ప్రత్యామ్నాయ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటే… కలిసి వస్తుందని నమ్ముతున్నారు. అందుకే.. బీజేపీకి భిన్నమైన సిద్దాంతాలను ఇప్పటి నుండే గట్టిగా వినిపిస్తున్నారు. కశ్మీర్ పై బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. జాతీయ స్థాయి అభిప్రాయాలను గట్టిగానే వెల్లడిస్తున్నారు. గెలిచే పార్టీకి రాజకీయ […]

మోడీకి బిగ్ షాక్.. జమిలీకి ఆ రెండు పార్టీలు వ్యతిరేకం..?

ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జమిలీ ఎన్నికలపై నియమించిన కమిటీకి..ఆయా పార్టీలు లిఖితపూర్వకంగా తమ.. వాదన తెలియచేశాయి. దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని.. ఆ నివేదికల్లో పేర్కొన్నారు. అయితే.. అప్పట్లో సాధ్యం కాలేదు. రెండో సారి తిరుగులేని అధికారంతో… మోడీ అధికారం చేపట్టిన తర్వాత మరోసారి తన ఆలోచనను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి.. […]

లోక్ సభలో చిత్రం…సాయిరెడ్డి… సీఎం రమేష్ కలిసి మాట్లాడుకున్నారంటే..?

ఉప్పు నిప్పులా వుండే పార్టీల నేతలు ఇద్దరూ ఒక దగ్గర చేరితే…? టీడీపీ అన్నా… చంద్రబాబు అన్నా ఇంతెత్తున లేచే విజయసాయిరెడ్డి అదే టీడీపీ ఎంపీలతో కలిసి ఆహ్లాదంగా మాట్లాడుతుంటే… వైసిపి నెతల్లో ముఖ్యమంత్రి జగన్ ని మించి టీడీపీపై నిప్పులు చేరిగే నేత విజయసాయిరెడ్డి తనకు తానుగా వచ్చి టీడీపీ ఎంపీలతో కబుర్లు చెబితే… ఇది నిజంగా జరిగింది. అది కూడా ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు వేదికగా విజయసాయిరెడ్డి టీడీపీ ఎంపీలను కలిసి ఆహ్లాదంగా మాట్లాడారు. […]