పోలవరంపై ఢిల్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు…?

కాబోయే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు దానికోసం ఒక రోజూ కేటాయించి సమీక్షలు చేసి పనులు పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. కేంద్రం చేతిలో ప్రాజెక్ట్ పెడితే అది వేగవంతంగా జరగదన్న ఉద్దేశంతో తానే దగ్గరుండి ఆ పనులు పర్యవేక్షించారు. అయితే తాజాగా జగన్ మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. అవసరం అయితే మళ్ళీ టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. […]

వైసీపీ అంచనాలు తలక్రిందులు… ఆ రెండు చోట్ల మెజారిటీనే టీడీపీని గెలిపించింది

తెలుగుదేశం పార్టీ గెలుపునకు రేపల్లె, రేపల్లె రూరల్‌లో భారీ మెజార్టీ రావటంతో సునాయాసంగా అనగాని గెలిచారు. రేపల్లెలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ తగ్గించేందుకు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అభివృద్ధి చేయటం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం కావటంతోనే అనగానికి రేపల్లె మండలం అండగా నిలిచింది. కాపు సామాజికవర్గానికి టీడీపీ హయాంలోనే అభివృద్ధి చేయటం, అనగాని వారికి అండగా ఉండటంతో ఓట్ల […]

గాజువాకలో పవన్ ని ముంచింది ఏమిటో తెలుసా… ఆ పార్టీ సమీక్షలో దిమ్మతిరిగే వాస్తవాలు

మార్పు కోసం రాజకీయాలు మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తొలి యుద్ధంలోనే చతికిల పడ్డారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకోగా స్వయంగా పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోవడం జనసేన శ్రేణులను నివ్వెరపరించింది. అయితే గాజువాకలో గెలుస్తామని ధీమాగా ఉన్న పవన్ కల్యాన్ కి ఆ అతి ధీమాయే నష్టం చేసిందని తెలిపోయింది. మితిమీరిన విశ్వాసం, నాయకత్వలోపం గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓటమికి కారణమయ్యాయి. అడగందే అమ్మైనా […]

కోడెల ఓటమికి కారణం ఇదే.. సత్తెనపల్లిలో ఏం జరిగింది

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు భారీ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి గుండెకాయలా నిలిచింది సత్తెనపల్లి మండలం. అయితే ఈ ఎన్నికల్లో మండలంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును కోల్పోయింది. ఎన్నికలు ఏవైనా ఫలితాలలో ముందుండే మండలం నేడు డీలా పడింది. వైసీపీ జోరు వల్ల గత ఎన్నికలతో పోల్చుకుంటే మండలంలో టీడీపీ మెజార్టీ వేలల్లో తగ్గింది. 2014 […]

చంద్రబాబు స్వయంకృతం..! వాళ్ళు చెప్పిందే నమ్మాలా..!

“ప్రజలను ఇంత కష్టపెట్టానా..?” అని టీడీపీ అధినేత చంద్రబాబు… ఫలితాలపై ఆవేదనకు గురయినట్లు… ప్రచారం జరుగుతోంది. ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటో కానీ… ఈ ఫలితాలు రావడంలో మాత్రం.. కచ్చితంగా స్వయంకృతం ఉంది. ప్రజల్లో మారుతున్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నిజాయితీగా తెలుసుకోలేకపోయారు. తాను పెట్టుకున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు.. అనుకూలంగా ఉన్న నివేదికలు ఇచ్చే సరికి అదే నిజమనుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసింది. నిఖార్సైనా ఫీడ్ బ్యాక్ రావాలంటే… ఆ ఇచ్చే వ్యక్తి […]

ఏపీ ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలు ముగిసి తొలిసారి మీడియాతో మాట్లాడినపుడే వైసీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. ఆ క్రమంలో తొలిసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని తన ప్రమాణస్వీకరానికి ఆహ్వానించిన జగన్ అక్కడ కూడా హోదా అంశం ప్రస్తావనకు తెచ్చారు. ప్రధాని మోదీని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి చేయాల్సింది చేస్తూనే ఉండాలని రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ […]

ఏపీ అధికారులకు ఇంత హడావుడి ఎందుకు..? కారణమిదేనా..?

నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ గెలుస్తుందనే మౌత్ టాక్ ప్రారంభం కావడంతో… చాలా మంది అధికారులు… జగన్ క్యాంప్‌నకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అధికారిక రహస్యాలు … పంపడం దగ్గర్నుంచి… టీడీపీ నేతలను పట్టించుకోకపోవడం వరకూ.. చాలా అంశాలపై అతిగా స్పందించారు. ఇదంతా.. మంచి పోస్టింగ్‌ల కోసమేనన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగడం ఖాయమయింది. వైసీపీ గెలిచిన విషయం తెలిసిన వెంటనే.. […]

చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి షాకిచ్చిన సొంత తమ్ముడు..?

ఆయన వైసీపీలో కీలక నేత. కాబోయే స్పీకర్ లేదా కీలక మంత్రిగా కూడా ప్రచారంలో ఉంది. వైసీపీలో గత పదేళ్లుగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో ఆయనే కీలక భూమిక పోషించారని ప్రచారంలో ఉంది. జగన్ పాదయాత్ర ప్రకటించగానే అందుకు అయ్యే వ్యయం మొత్తం తానే భరిస్తానని ముందుకు వచ్చిన నేత ఆయన. అయినా జగన్ మాత్రం పాదయాత్ర ఖర్చు పార్టీయే భరిస్తుందని చెప్పడంతో ఆయనపై భారం పడలేదు. అయినప్పటికి రాజకీయాల్లో దురందరుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ […]

కుప్పంలో ఏం జరిగింది… చంద్రబాబు మెజారిటీ తగ్గడం వెనుక కారణం ఇదేనా..?

రాష్ట్రంలో బలంగా వీచిన వైసిపి గాలి ప్రభావం చంద్రబాబు ఇలాకా… టీడీపీకి పెట్టని కోట కుప్పంపై కూడా చూపించింది. అక్కడా చంద్రబాబుకు వస్తుందనుకున్న మెజారిటీ తగ్గిపోయింది. ఇరుకు కారణాలు ఏమిటనేదానిపై ఇప్పుడు పోస్టుమార్టం మొదలైంది. కసిగా పనిచేసి ముఖ్యమంత్రి అభ్యర్థి మెజారిటీ తగ్గించడంలో విజయం సాధించాయి వైసీపీ శ్రేణులు. టీడీపీలోని స్థానిక నాయకులమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వారికి ఆకాంక్షను ఈర్చడానికి బాగానే ఉపయోగపడింది. తమ అభ్యర్థి ఓడిపోయినా సరే.. ప్రత్యర్థి మెజారిటీ తగ్గించడాన్నే గెలుపుగా భావిస్తున్న […]

ఫిరాయింపులకు జగన్ రెడీ..! జంపయ్యే టీడీపీ నేతలు వీరే..!

తెలుగుదేశం పార్టీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అటు లోక్ సభకు, ఇటు శాసనసభకు పోటీ చేసిన వారిలో అనేక మంది పరాజయం పాలవడంతో వీరిలో కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారు. జగన్ ఆహ్వానిస్తే కొంత మంది కొత్తగా ఎన్నికైన వారు కూడా.. చేరే అవకాశం ఉందని.. తెలంగాణ పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. కానీ వైసీపీలో మాత్రం ఇప్పట్లో తెలుగుదేశం నుంచి చేర్చుకునే అవకాశాలు కల్పించడం లేదు. వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడం, మరోవైపు తెలుగుదేశం […]