బొండాకు ఝులక్.. ఆ యువనేతకు వల..! బెజవాడ టీడీపీలో జరుగుతోంది ఇదే..!?

విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు… పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం ఇస్తామని … బేరం పెట్టడంతో.. ఓ టీడీపీ యువనేత తన సన్నిహితులతో.. గత ఐదారు రోజులుగా తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ విషయం.. బయట విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ…. ఆయన ఎలాంటి ఖండన ప్రకటనలు చేయలేదు. దాంతో ఆయన పార్టీ మార్పు కోసమే..మొగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు. దీనిపై.. ఒకటి, రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. నిజానికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమను.. వైసీపీలోకి తీసుకోబోతున్నారని.. ఆయనకు తూర్పు నియోజకవర్గం ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది.

అయితే.. బొండా ఉమ కన్నా… ఈ యువనేత వల్లే ఎక్కువగా లాభం ఉంటుందని.. వైసీపీ అగ్రనేతలు అంచనాకొచ్చినట్లుగా భావిస్తున్నారు. యువనేత పార్టీ మార్పునకు కారణం… వారి కుటుంబానికి బద్దశత్రువులుగా భావించే వారిని… ఎన్నికలకు ముందు టీడీపీలో చేర్చుకున్నారు. పైగా.. తనకు విజయవాడ నగరం నుంచే రాజకీయం చేయాలన్న ఆలోచన ఉంది. టీడీపీ లో.. విజయవాడ నగరం నుంచి అవకాశం దక్కడం కష్టమన్న అంచనాలు ఉన్నాయి. మూడు నియోజకవర్గాల్లో ఒకరు కాకపోతే.. మరొకరు అన్నంత బలమైన నేతలు ఉన్నారు. ఈ క్రమంలో.. విజయవాడలోనే తన కార్యక్షేత్రం ఉంచుకోవాలంటే… పార్టీ మార్పే ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. మున్సిపల్ ఎన్నికలకు ముందు కొన్ని వలసలు ఖాయమని చెబుతున్నారు. నవంబర్ నుంచి స్థానిక, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల.. నేతల్ని చేర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.గతంలో.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత తనయుడు.. ఇప్పుడు వైసీపీలో చేరడానికి అంగీకారం తెలిపారని అంటున్నారు.

ఆయన…వైఎస్ మరణం తర్వాత… జగన్‌తో పాటు నడవలేదు. కొన్నాళ్లు కాంగ్రెస్‌లోనే ఉండి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు.. కృష్ణా జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా… ఫుల్ టైం రాజకీయనేతగా… కష్టపడతారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో.. ఆ యువనేతపై దృష్టి పెట్టిన … వైసీపీ.. తమ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.