బిజేపీకి క్లారిటీ…ఢిల్లి ఏన్నికలలో గెలవమని ముందుగానే…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఎన్నికల తుది ఫలితాలు రావడానికి కొద్ది గంటల ముందు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఒక పోస్టర్ ప్రత్యక్షమయింది. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌ను చూస్తే ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్లుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటో కూడా కనిపిస్తోంది.

 

ఆ పోస్టర్‌పై ‘విజయంతో మనం అహంకారులుగా మారకూడదు. పరాజయంతో మనం నిరాశకు గురి కాకూడదు’ అని రాసివుంది. అయితే ఓట్ల లెక్కంపునకు కొద్ది గంటల ముందు బీజేపీ నేతలు తమ విజయం ఖాయమనే వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీ నేత మనోజ్ తివారీ తాము ఢిల్లీలో 55 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంతకుముందు తివారీ తాము 48 సీట్లు గెలుస్తామని ట్వీట్ చేశారు. కాగా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని బీజేపీ నేత విజయ్ గోయల్ హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించారు. కానీ.. అనూహ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఇలాంటి పోస్టర్లు కనిపించడంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమయింది.

"
"