బీజేపీ పతనానికి నేడే ముహుర్తం..! సీబీఐ కూడా కాపాడలేదా..?

లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో.. భారతీయ జనతా పార్టీకి మరణశాసనం లిఖిస్తున్నాయి.. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు. భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి రానీయకూడదనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఎనభై సీట్లలో చెరో 37 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆరు స్థానాలు.. కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలకు వదిలేశారు. కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు.. అదీ కూడా.. సోనియా, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్‌బరేలీలను మాత్రమే వదిలేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే సారి ఉండాలా.. వద్దా అని నిర్ణయించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ . ఆ రాష్ట్రంలో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లే.

ఎస్పీ, బీఎస్పీ చెరోసారి పూర్తి మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడది గత వైభవంగా మారింది. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో మోదీ చరిష్మాతో బీజేపీ కూటమి ఏకంగా 73 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ ఎన్ని సీట్లు తగ్గిపోతే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి అంతగా అవకాశం తగ్గిపోతుంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే.. భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితి వస్తుందని అనేక సర్వేల్లో వెల్లడవడంతో.. ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా.. భారతీయ జనతా పార్టీ చేయాల్సినదంతా చేసింది. చివరికి అఖిలే‌ష్ యాదవ్ పై సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయంటూ… కేసు నమోదు చేసి.. సీబీఐ అధికారులు ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. కొంత మంది అధికారులపైనా దాడులు చేశారు. అయితే అఖిలేష్ దీన్ని మరింత సవాల్‌గా తీసుకున్నారు. ఏం చేసినా.. కూటమి కట్టడం ఆపలేరని సవాల్ చేశారు. మీతో సీబీఐ ఉంది.. మాకు కూటమి ఉందని… యూపీలో ఫ్లెక్సీలు వేసి బీజేపీకి సవాల్ చేశారు. భారతీయ జనతా పార్టీని ఇక సీబీఐ కూడా కాపాడలేదని తేలిపోయిదంన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూపీలో సీట్లు తగ్గిపోతే.. హిందీ రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ నష్టపోతుంది. అదే జరిగితే.. పాతాళంలోకి పడిపోతుంది.