బీజేపీ అనుకున్నట్టుగానే.. అయోధ్యపై సానుకూల తీర్పు

అయెధ్య రామమందిరం పై సుపిరిం కోర్ట్ నుండి అనుకులంగానే వస్తుందని యూపి సియం మోగ్ అదిత్యనాధ్ పేర్కోన్నారు. ముస్లింలు తమ వైఖరిని మార్చుకొని.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి అంగీకరించి ఉంటే బాగుండేదని అన్నారు. న్యూస్‌ 18 నెట్‌వర్క్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అయోధ్య కేసుపై మాట్లాడారు యోగి. వాద-ప్రతివాదులు కలిసి మొండిగా ముందుకెళ్లడం వల్లే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.

 

ఏదేమైనా రామజన్మభూమి వివాదాన్ని సుప్రీంకోర్టు త్వరలోనే పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.మరోవైపు అయోధ్య రామ జన్మ భూమి కేసులో విచారణ అక్టోబరు 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించే ప్యానెల్‌కు కోర్టు ఇంకా ద్వారాలు తెరిచే ఉందని స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని కొన్ని వర్గాలు తనను అభ్యర్థిస్తున్నట్లు న్యాయమూర్తి ఖలీఫుల్లా తనకు లేఖ రాశారని గుర్తు చేశారు. ‘అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై న్యాయస్థానం ఆశతో ఉంది. దానికోసం మనమంతా కలిసి కృషిచేద్దాం’ అని గొగోయ్ అన్నారు

"
"