బిగ్ బ్రేకింగ్.. టీపీసీసీ పదవి నుండి ఉత్తమ్ ఔట్..!

తెలంగాణలో హుజెర నగర్ లో ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రేస్ గెలిచి తీరుతుందని అయన తెలిపాడు. ఇక టీఆర్ఎస్ నాపై  బురద  చల్లాలని చూస్తుందని అయన్ తెలిపాడు.అలాంటివి ఇక్కడా ఎన్ని చెసిన మా గెలుపును  అపే సత్తా ఎవరికి లేదని తెలిపాడు. ఇక తన భార్య పద్మావతి ఇక్కడ కచ్చితంగా గెలిచి తీరుతుందని అయన తెలిపాడు.ఇక  ఇక్కడ టీఆర్ఎస్ గెలవడానికి ఏన్నొ ప్రయత్నాలు చేస్తుందని కానీ ఇక్కడ అలాంటివి కుదరవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపాడు.కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌ నగర్‌లో అసెంబ్లీ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్సే దక్కించుకునేలా చేస్తానని బల్లగుద్ది చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడి నుంచీ ఎమ్మెల్యేగా గెలిచి… తర్వాత ఎంపీ అయిన ఉత్తమ్… ఇప్పుడు ఇదే స్థానంలో తన భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో దింపి… ఉద్ధృతంగా ప్రచారం సాగిస్తున్నారు.

ఆమె గెలుపు బాధ్యత తనదే అని ప్రకటించిన ఉత్తమ్… ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని… భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు ఇలా కాంగ్రెస్ కీలక నేతలను ప్రచార బరిలో దింపుతున్నారు. అలాగే… 18, 19 తేదీల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయబోతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా చివర్లో రెండ్రోజులు ప్రచారం చేస్తారని తెలిసింది. ఇలా.. పద్మావతి రెడ్డి గెలుపు కోసం ఉత్తమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.ఐతే… టీ-పీసీసీగా ఉత్తమ్ సారధ్యంలో జరిగే చివరి ఎన్నిక ఇదే అనే ప్రచారం సాగుతోంది. ఇందులో సత్తా చాటితేనే ఆయన్ని టీ-పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారనీ లేదంటే పదవి నుంచీ తొలగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన పదవీ కాలం ఆల్రెడీ పూర్తి కావస్తోందనీ, అందువల్ల సహజంగానే తనను తప్పించి వేరేవారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకూ, తన పదవికీ సంబంధం లేదని అంటున్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందంటున్న ఆయన… కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం మొత్తం బాధ్యత తనదే అంటున్నారు.ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. అందువల్ల 19 సాయంత్రం వరకూ పార్టీలు ప్రచారం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. అంటే… నేడు కాకుండా మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే… కచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్… కాలినడకన ఇంటింటి ప్రచారం సాగిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ… ఆర్టీసీ సమ్మె కారణంగా… ప్రజల నుంచీ వ్యతిరేకత చూస్తోందంటున్న కాంగ్రెస్ నేతలు… హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ ఆ ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా… తామంతా ఐక్యంగా ఉన్నామని నిరూపిస్తామంటున్నారు సీనియర్ నేతలు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే… ఉత్తమ్ టీ-పీసీసీ చీఫ్‌గా ఉన్నా, లేకపోయినా… ఈ ఫలితం టీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చినట్లే అవుతుంది. టీఆర్ఎస్ ఓడిపోతే… అది కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే వీలుంటుంది. అప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరున్నా… పార్టీని ధైర్యంగా ముందుకు నడిపే ఛాన్స్ ఉంటుంది. అందుకే… హుజూర్ నగర్ బైపోల్… అన్ని పార్టీలకూ కీలకంగా… కాంగ్రెస్‌కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.కానీ ఇక్కడ గెలవడం రెండు పార్టిలకు అత్యంత ప్రతీష్టాత్మకంగా మారింది. ఇక్కడ ఏలాగైనా గెలవాలని కాంగ్రేస్, టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాని చివరికి ఏవరు గెలుస్తారో అని ఇక్కడ బైపోల్ చాలా అసక్తిగా మారింది అని ఉత్తం కుమార్ రెడ్డి తెలిపాడు.