బోటు ప్రమాదంలో ఆ మంత్రి హస్తం..? సంచల విషయాలు బయటకు

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన బోటు ప్రమాదం అందరిని ఒక్కే సరి ఉలిక్కిపడేలా చేసింది…. ఏ ఘటనలో చాల మంది ప్రాణాలు వదిలారు . సోమవారమే బోటు జాడ తెలిసినా వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదంపై సీఎం జగన్‌ను అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు హర్ష కుమార్.గోదావరి లాంచీ ప్రమాదంపై రాజకీయం దుమారం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద బోటు ప్రమాదానికి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసే బాధ్యుడని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవీపట్నం వద్ద ఎస్సై అనుమతి ఇవ్వలేదని..

ఆ సమయంలో అవంతి ఫోన్ ‌చేసి బోటును ముందుకు పంపించాల్సిందిగా ఆదేశించారని ఆరోపించారు. ప్రయాణికుల సంఖ్య విషయంలోనూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని అధికారులను విమర్శించారు. సోమవారమే బోటు జాడ తెలిసినా వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదంపై సీఎం జగన్‌ను అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు హర్ష కుమార్.మరోవైపు గోదావరిలో గల్లైంతన బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 210 అడుగుల లోతులో ఉన్న లాంచీని పైకి ఎలా తీసుకురావాలన్న దానిపై సమాలోచలు చేస్తున్నారు అధికారులు. ముంబై, ఉత్తరాఖండ్ నుంచి నిపుణులను రప్పించినా..బోటును పైకి తీసుకొచ్చే అంశంపై ఓ నిర్ణయానికి రాలేదు.

ఆదివారం 73 మంది పాపికొండలు యాత్రకు బయలుదేరిన రాయల్ వశిష్ట లాంచీ.. దేవీపట్నం మండలం కచ్చూలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయింది. బోటులో 64 మంది పర్యాటకులు, 9 మంది బోటు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటివరకు 35 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 12 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. బోటు మునిగి 5 రోజులు కావడంతో వారంతా చనిపోయి ఉంటారని.. మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

"
"