నెల్లూరుకూ ఎయిర్‌పోర్ట్..! చంద్రబాబు విజన్ అదుర్స్..!

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయం నిర్మాణం కాబోతోంది. రూ.334కోట్లతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. పదేళ్ళుగా ఎదురూ చూస్తున్న నెల్లూరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి గతంలోనే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని 2007 లో అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 3500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థతో ఎంవోయూ కూడా చేసుకున్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ పెద్దల తనయుల…కమిషన్ల కక్కుర్తు కారణంగా.. ఎక్కడివక్కడ ఆగిపోయింది.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మించాల్సిందేనని నిర్ణయించింది. దీని కోసం భూసేకరణ చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. మొదట అనుకున్న 3500 ఎకరాలు కాకుండా తొలి, మలి విస్తరణకు అవసర మైన 1352 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.130 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేసింది. బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంపెనీ లిమిటెడ్ సారథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం, నిర్వహణ జరగనున్నది. తొలి, మలి దశ విస్తరణ కోసం 1౩52 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 1054 ఎకరాలు సేకరించారు.

పదేళ్లుగా ఈ విమానాశ్రయం కోసం పాలకులు ఎన్నో హామీలు గుప్పించి ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్ ఈ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమం అయింది. చంద్రబాబు శంకుస్థానప చేసిన వెంటనే పనులు శరవేగంగా సాగనున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కూడా ప్రారంభమయింది. త్వరలో… కుప్పం ఎయిర్ స్ట్రిప్ అలాగే… దగదర్తి ఎయిర్ పోర్టు పనులు కూడా పూర్తవుతాయి. అప్పుడు దేశంలోనే విమానయాన కనెక్టివిటి.. ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ ఘనతకెక్కుతుంది. బోగాపురం పూర్తయితే.. అంతర్జాతీయంగా… విమాన ప్రయాణికులునేరుగా.. ఏపీకి వచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది.