బాబు ఢిల్లీ దీక్షతో వాళ్లకి వణుకొచ్చేసింది..! జాతి మీడియాలో ఏం చెబుతున్నారో తెలుసా..?

చాయ్ వాలాను అవమానించారు..! వాళ్లు మోడీ ని విమర్శించారు..! అంటూ.. బీజేపీ జాతి మీడియా… చంద్రబాబు దీక్ష దగ్గర రెట్టలు ఏరుకునే ప్రయత్నం చేస్తోందంటే… బీజేపీకి.. చంద్రబాబు దీక్ష ఎంత భయంకరంగా కనిపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు దీక్ష జాతీయ రాజకీయాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైన వైనాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ దగ్గర నుంచి … రాహుల్ వరకూ.. అందరూ… వస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా తదితరులు చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు తెలిపారు.

చంద్రబాబు దీక్ష ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఏకైక హాట్ టాపిక్ అయింది. ప్రధాన మీడియా మొత్తం మారథాన్ కవరేజీ ఇస్తున్నాయి. కానీ.. బీజేపీకి దగ్గరగా ఉన్న రెండు ఇంగ్లిష్ చానళ్లు మాత్రం… పానకంలో పుడకలా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు దీక్షలో.. చాయ్ వాలానలను అవమానించే విధంగా … ప్లకార్డులు పెట్టుకున్నారని.. ఒకరు.. చంద్రబాబు తెగ ఖర్చు పెట్టేశామని.. మరొకరు.. కథలు కథళుగా చెప్పుకుంటున్నారు. అసలు విషయం అది కాదండి.. మోడీ చేసిన.. మోసమండి.. అని ఆయన చానళ్లక సోషల్ మీడియా ఖాతాలకు.. వందలాది మెసెజులు వెళ్తున్నా.. పాపం వారు మాత్రం తమ కంఠశోషను కొనసాగిస్తున్నారు.

ఢిల్లీలో కూర్చుని.. అమిత్ షా, ప్రశాంత్ కిషోర్.. మరికొంత మంది… చంద్రబాబు దీక్షకు కవరేజీ రాకుండా ఎలా చేయాలన్నదానిపై.. కసరత్తు చేస్తున్నారు. కవరేజీ ఆపడం సాధ్యం కాదు కాబట్టి… కనీసం.. దుష్ప్రచారం అయినా చేయాలని.. అమిత్ షా తమ … జాతి మీడియా చానళ్లను ఆదేశించారు. జర్నలిజాన్ని వారికి తాకట్టు పెట్టేసినా.. ఆయా మీడియా సంస్థలు.. టీ కప్పుల మీద ఈగలు తోలుకోవడం ప్రారంభించాయి. ఎంతనా చాయ్ వాలా అని చెప్పుకునే మోడీకి.. సారగిల పడ్డ జాతి మీడియాకు అంతకు మించి ఈ రోజు ఏమీ కనిపించకపోవచ్చు.