అవినీతి చేయడమే జగన్ లక్ష్యం.. నోరు జారి అడ్డంగా బుక్కయిన కిల్లి కృపారాణి

ఇప్పుడూ అసలె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి వేడీ మీద వున్నాయి. ఇలాంటి సమయంలో అటు వైసీపీ నెతలు. ఇటు టీడిపీ నెతలు  వాళ్ళు చేసే వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా చేయ్యాలి. లేకపోతే అవతల వాళ్ళు రెడీగా వుంటారు వాళ్లపై  జోక్ లు వెసు కోవడానికి  ఇక  ఇప్పుడూ జరిగిన సంఘటన కూడా అందులో ఒకటి. ఒక్క పదం  కిల్లి  కృపారాణి వాడడం వల్ల మోత్తం అర్థం మారిపోయింది. రాజకీయ నాయకులు ఎవరైనా నోరుజారడం కామన్.. తాజాగా కేంద్రమాజీ మంత్రి, వైసీపీ నేత కిల్లి కృపారాణి కూడా నోరు జారారు. ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

అది విన్న నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే వారిని గమనించిన కృపారాణి తన పొరపాటును గుర్తించి సరిచేసుకున్నారు. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా ఇటీవల నోరు జారాడు.. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు అనబోయి.. నిర్విరారామం చేశారు అన్నాడు.. ఇలా ఒకసారి అనుకుంటే పొరపాటే కానీ.. అదే మాటను మరోసారి పలకడంతో సమావేశానికి వచ్చిన విలేకరులు షాక్ అయ్యారు.అలాగే  హొంమంత్రి  మెకతోటి సుచరిత కూడా అలాగే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అవినితి మయం చేస్తాం అని  అప్పుడు అమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రెపాయి. అంతెందుకు వైసీపీ సీనియర్ నాయకురాలు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా ఓసారి ఇలానే నోరు జారారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రోజా మాట్లాడుతూ.. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడని వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో ఆమెపై జోకులు పేలాయి.