దూకుడు పెంచిన టీడీపీ.. తాజా వ్యూహానికి కుదేలైన వైసీపీ..!

ఒకప్పుడు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురులేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఎప్పుడూ పైచేయి సాధించడానికే ఆ పార్టీ అగ్రనేతలు తహతహలాడే వారు. ఇతర ప్రధాన పార్టీలను అన్ని అంశాల్లోనూ ముప్పుతిప్పలు పెట్టేలా వ్యవహరించేవారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం పార్టీ శ్రేణులను కుదేలయ్యేలా చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అయితే ఈ స్థితి నుంచి మళ్లీ పశ్చిమ టీడీపీ శ్రేణులు పుంజుకుంటున్నాయి. అధికార […]

జగన్ మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రణాళిక మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటి స్ధానంలో మొత్తం 13 జిల్లాలకు కలిపి నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించే ఉద్దేశంతో […]

కెసీఆర్,హరీష్ రావు దూరం..?? సాక్షాలివే…!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించారు. గజ్వేల్ మండలం కోమటిబండలో నిర్మించిన భగీరథ సంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. సంప్‌హౌజ్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో 456 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు ఈ భారీ సంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ భారీ సంప్‌హౌస్‌ నుంచి నిత్యం […]

జగన్ నువ్వు ఇలాగే వుంటే చాలా కష్టం

అమరావతి తరలింపుపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. ఇటీవలి వరదలకు రాజధాని ప్రాంతం ముంపుకు గురవడంతో.. అలాంటి చోట రాజధాని నిర్మాణం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తుండటంతో.. దీనిపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌ను […]

సాహూ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

కాంట్రవర్సీకి మించిన పబ్లిసిటీ లేదంటారు. సాహో నిర్మాతలు అలాంటి కాంట్రవర్సీ ఏదీ తమంతట తాముగా క్రియేట్‌ చేయకపోయినా, తమ చిత్రానికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. సాహో చిత్రాన్ని టీడీపీ శ్రేణులు తొక్కేస్తున్నాయనే గాలి వార్త ఒక వెబ్‌సైట్‌లో వచ్చింది. దానికి సరాసరి టీడీపీ అధ్యక్షుడి తనయుడు నారా లోకేష్‌ స్పందించడంతో అది హాట్‌ టాపిక్‌ అయింది. ఈ వ్యవహారంలో క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునే క్రమంలో సాహో కోసం తాను ఎంతగా ఎదురు చూస్తున్నదీ కూడా […]

చంద్రబాబుకు,జగన్ కు తేడా ఇది ఒక్క రీజన్ చాలు..!

ఏపీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. విపక్ష నేత హైదరాబాద్ లో ఉన్నారు. ఇలాంటి వేళ.. ఏపీకి ఇతర రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా వెల్లువెత్తుతున్న వదర నీరుతో వరద ముంపు ప్రాంతాలు నీళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇలాంటివేళ.. అధికారులు పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇదే సమయంలో బాబు నివాసంపైన డ్రోన్ ఎగిరిన వైనంపై తెలుగు తమ్ముళ్లు రచ్చ చేయటం మినహా చేసిందేమీ లేదు. ఎంతసేపటికి తమ బాస్ సెక్యురిటీ గురించి తప్పించి ప్రజల గురించి.. […]

మంత్రులపై జగన్ సంచలన నిర్ణయం…!

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలకు, తనను […]

అమరావతిపై కావాలనే కుట్ర పన్నుతున్నారు

నేడు మంగళవారం నాడు కృష్ణ జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి, రాజధాని నిర్మాణాన్ని కావాలనే నిలిపేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. […]

టీడీపీకి బిగ్ షాక్…! వైసీపీ లోకి కీలకనేత

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో […]

టీడీపీకి భారీ విరాళాలు.. ప్రాంతీయ పార్టీలలో ఇదే హైయ్యేస్ట్

తెలుగుదేశం పార్టీకి 2018-19లో రూ.26.17 కోట్లు విరాళాల రూపంలో అందాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు మించి విరాళంగా అందించిన వారి వివరాలతో కూడిన నివేదికను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. పై మొత్తంలో అత్యధికంగా రూ.25 కోట్లు ఫ్రూడెంట్‌ ఎన్నికల ట్రస్టు విరాళంగా ఇచ్చింది. అప్పటి టీడీపీ నేతలు… ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామ కృష్ణంరాజు రూ.20 లక్షలు […]