బిగ్ బ్రేకింగ్.. అప్పుడే ఎన్నికలు.. బయటపెట్టిన చంద్రబాబు

ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ధైర్యం చెప్పాడు.మరేం పర్వాలెదు. మీరు ధైర్యంగా వుండమని చెప్పాడు.అలాగే మనం అభివృధ్ది పనులు బాగనే చేసాం. వాళ్ళు కేవలం ఒక్క అవకాశం ఇవ్వమని కోరారు.కాని ఎన్నికల సమయంలో మనం చేసీన తప్పుల గురించి చెప్పలేకపోయారన్నారు కేవలం ప్రజలు కోత్త ప్రభుత్వం ఏలా వుంటుందో చుద్దాం అని జగన్ ని ఎన్నుకున్నారన్నారు.కాని ఇప్పుడు పరీస్థీతి పుర్తిగా మారింది ప్రజలు ఎక్కువ శాతం జగన్ కి ఎందుకు ఓటు వేసామా అని ఇప్పుడు అనుకుంటున్నట్టు తెలిపాడు

మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ లీగల్ సెల్ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం టీడీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబు పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వైసీపీ పాలనపై ఆయన మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ లా రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండేవని, కానీ రివర్స్ ఎన్నికలు మాత్రం రావు..జమిలి ఎన్నికలు మాత్రం వస్తాయని స్పష్టం చేశారాయన. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల విషయంలో ఢిల్లీ నుంచి బాబుకు ఏదైనా సమాచారం వచ్చిందా అని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ అంటోంది.

దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి 10tvతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి..మూడు నెలలు మాత్రమే అయ్యిందన్నారు. బాబు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎప్పుడు ఎ న్నికలు వచ్చినా..తమ పార్టీ రెడీగా ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతిస్తోందన్నారు. దేశ మంతా ఒకేసారి ఎన్నికలు వస్తే..ఖర్చు తగ్గడమే కాకుండా పలు ఉపయోగాలున్నాయన్నారు. ప్రజలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.

"
"