ముఖ్యమంత్రి పదవిలో కోర్టుకు హాజర్ కానున్న జగన్…

వైఎస్ జగన్ కోన్ని రోజులుగా సీయం అయినప్పటి నుండి కోర్టుకు హాజరు కావడం లేదు. తాజాగా ఆయనను సీబిఐ హెచ్చరించింది. లేకపోతే చర్యలు కాస్త కఠినంగా వుంటాయని తెలిపారు.అక్రమాస్తుల కేసులో ప్రథమ నిందితుడైన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. నిరుడు మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వస్తున్నారు.

 

అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరు కావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదనరావు గత వారం (3వ తేదీన) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరై తీరాలని.. లేదంటే తగు ఉత్తర్వులు జారీచేస్తానని హెచ్చరించారుదీంతో జగన్‌ శుక్రవారం కోర్టుకు వెళ్లనున్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరు కానుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. శుక్రవారం జగన్‌ కోర్టుకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో.. సీబీఐ కోర్టు వద్ద తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

"
"